కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ
Published Sat, Jun 3 2017 3:56 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
సాక్షి, హైదరాబాద్: అమరవీరుల త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాను ఆవిర్భావ దినోత్సవం రోజున టీఆర్‌ఎస్ మరచిపోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం లేకుండా పో యిందని, రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్నారని ఆరోపించా రు. పదవుల్లో ఉన్నవారు సంబరాలు చేసుకుంటున్నా ప్రజలు సంతోషంగా లేరన్నారు.
Advertisement
Advertisement