
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి జి.నిరంజన్ అన్నారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే తెలంగాణ వచ్చిందన్నారు.
సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణలో అధికారం సాధించిన కేటీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని, కన్నూమిన్నూ కానకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని అసమర్థతను ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ నిలదీస్తుందన్నారు. సమస్యల గురించి మాట్లాడకుండా కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, దూషణలు మానుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని మల్లు రవి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment