దాడులు కొనసాగితే పౌరయుద్ధం: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలపై భౌతిక దాడులు, ప్రజలపై అరాచ కాలు ఇదే విధంగా కొన సాగితే దేశంలో పౌర యుద్ధం వస్తుందని టీపీసీ సీ ఉపాధ్యక్షుడు మల్లు రవి హెచ్చరించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లా డుతూ... దేశంలో నియంతపాలన నడుస్తోందని విమర్శించారు.
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై గుజరాత్‌లో జరిగిన దాడి దేశంలో నియంత పాలనకు పరాకాష్ట అని అన్నారు. జెడ్ కేటగిరీ భద్రత కలిగిన నేతకే రక్షణ లేకుండా పోయిందని, ఇంకా సామాన్యులకు రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అండ చూసుకునే ఈ దాడులు జరిగాయని ఆరో పించారు. గోమాంసం తింటున్నారన్న నెపంతో మనుషులను కొట్టి చంపుతున్నారని అన్నారు.