'ఓపిక లేకపోతే రాజకీయాలు వదిలేయండి'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఓపిక లేకపోతే రాజకీయాలు వదిలి పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి హితవు పలికారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సన్నాసులు అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. అసహనంతోనే కేసీఆర్ తిట్ల పురాణం అందుకున్నారన్నారు. సీఎం వ్యాఖ్యల కారణంగానే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం ప్రతిపక్షాల ప్రాధమిక హక్కు అని తెలిపారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ రూ.9 వేల కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు.