
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని బీజేపీ, ప్రధాని మోదీ ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి మండిపడ్డారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాజస్తాన్‌లో కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసి గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. ‘‘మోదీ, అమిత్‌షా కనుసన్నల్లోనే ఇలాంటి విధానాలు అవలంభిస్తున్నారు. మోదీ, బీజేపీ తాత్కాలిక ఆనందం పొందొచ్చు కానీ అంతిమ విజయం మాదే. తెలంగాణ లో కూడా నిరసన తెలిపే హక్కు లేదు. ఎక్కడిక్కడ పోలీసులను పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. రాష్ట్రం, దేశంలో ఎక్కడా ప్రజాస్వామ్యం లేదు. తీవ్రంగా ఖండిస్తున్నామని’’ ఆయన ధ్వజమెత్తారు.
ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు..
రాజస్తాన్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టాలని ప్రయత్నం చేస్తోందని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. తమకు ఉన్న మెజార్టీని అమిత్‌షా, మోదీ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజస్తాన్ పరిణామాలపై నిరసనగా సోనియాగాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చలో రాజ్‌భవన్‌కు పిలుపు నిచ్చామని పేర్కొన్నారు.కేంద్రంలో బీజేపీ, ఇక్కడ టీఆర్‌ఎస్ అడ్డుకుంటుందని.. పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తున్నారని అంజన్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment