ఆరోగ్యశాఖకు రోగం వచ్చింది: మల్లు రవి
హైదరాబాద్:
తెలంగాణ ఆరోగ్య శాఖకు రోగం వచ్చిందని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. రాష్ట్రంలో ఆరోగ్యం పడకేసిందని ఆరోపించారు. నిలోఫర్ ఆస్పత్రిలో సరిపడా మందులు లేక గర్భిణీలు చనిపోవడం దారుణమన్నారు. ఆరుగురు బాలింతల చావుకు ప్రభుత్వానిదే బాధ్యతని చెప్పారు. ప్రభుతాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
నిలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఇటీవలి కాలంలో సంభవించిన వరుస చావులపై ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరారు. అదేవిధంగా గాంధీ ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.