Telangana health departement
-
ప్రభుత్వ అధికారి అయితే.. కేసీఆర్ కాళ్ళు మొక్కవద్దా : DH. శ్రీనివాస రావు
-
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాస రావుతో " స్ట్రెయిట్ టాక్ "
-
తెలంగాణకు ‘ఫుల్ ఫీవర్’.. డెంగీ, మలేరియాతో ఆస్పత్రులకు జనం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి జ్వరమొచ్చింది. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో జనం సతమతం అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలోనే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రుల దాకా రోజూ వేలాది మంది ఔట్ పేషెంట్లు క్యూకడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులూ నమోదవుతున్నాయి. వానలు.. దోమలతో.. ఈసారి తరచూ వానలు పడుతుండటం, మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, అన్నిచోట్లా నీరు నిల్వ ఉండటం, పారిశుధ్య నిర్వహణ లోపం.. ఇవన్నీ కలిసి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కలుషితాలు వ్యాపిస్తున్నాయి. దీనితో వైరల్ జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా మంది గొంతు నొప్పి, జ్వరంతో ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా న్యుమోనియా, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలూ పెరుగుతున్నాయని అంటున్నారు. పెరుగుతున్న డెంగీ కేసులు అపరిశుభ్ర పరిస్థితులు, దోమల వ్యాప్తి కారణంగా డెంగీ, మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 7 వేలకుపైగా డెంగీ కేసులు నమోదుకాగా.. ఇందులో ఒక్క ఆగస్టులోనే 3,602 కేసులు వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగీ కేసుల వివరాలు సరిగా అందక ఈ సంఖ్య తక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్రంగా.. విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల తీవ్రత గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులు సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖాలకు వచ్చే బాధితుల సంఖ్య బాగా పెరిగింది. పలు ఆస్పత్రుల్లో బెడ్లు రోగులతో నిండిపోయాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులూ నమోదవుతున్నాయి. ఒక్క మేడ్చల్ పరిధిలోనే 492 డెంగీ కేసులు వచ్చినట్టు జ్వర సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి తెరతీశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా తీవ్రత గత ఐదు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు 49.67 లక్షల మంది ఔట్ పేషెంట్లు వచ్చారని వైద్యారోగ్యశాఖ బుధవారం వెల్లడించిన నివేదిక తెలిపింది. సగటున నెలకు 9.93 లక్షల ఓపీ నమోదైనట్టు పేర్కొంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధికంగా అనారోగ్యాల బాధితులు ఉన్నారని.. ఇందులో విష జ్వరాల కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వర బాధితులే.. ► నల్లగొండ జిల్లాలో విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అధికారికంగానే 56 మందే డెంగీ బారినపడ్డట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ► కరీంనగర్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 236 డెంగీ కేసులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి రోజూ 150 మంది వరకు విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ 38, వైరల్ జ్వరాలు 1,872 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఈ ఒక్క నెలలోనే 188 డెంగీ కేసులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో రోజూ వందల్లో జ్వర బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. ► ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనూ సీజనల్ వ్యాధుల కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రోజూ 1,500 మందికిపైగా రోగులు వస్తున్నారని, అందులో విష జ్వరాల బాధితులు ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గత 15 రోజుల్లో 90 డెంగీ కేసులు వచ్చాయి. ► విష జ్వరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను హడలెత్తిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో ఒకరైనా మంచం పట్టి కనిపిస్తున్నారు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు సరిపోక కింద పరుపులు వేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 547 డెంగీ కేసులు, 83 చికున్ గున్యా కేసులు వచ్చాయి. ► ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోనూ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత నాలుగు నెలల్లో 86 డెంగీ కేసులు నమోదుకాగా.. వేల మంది వైరల్ జ్వరాల బారినపడ్డారు. ► సీజనల్ వ్యాధులు, జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వస్తున్న వారిలో 10 శాతం మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్న పరిస్థితి ఉంది. పిల్లల వార్డులో బెడ్లు నిండిపోయాయి. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచి చికిత్స చేస్తున్నారు. జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. మూడు రోజులుగా జ్వరంతో.. మా బాబు మహేశ్ వయసు ఎనిమిదేళ్లు. మూడు రోజులుగా తీవ్రంగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. బాగా నీరసంగా ఉంటే ఈ రోజు ఆస్పత్రికి తీసుకొచ్చాం. వైరల్ జ్వరంలా ఉంది.. పరీక్షలు చేయించాలని వైద్యులు అంటున్నారు. – మహేశ్ తల్లి, ఉప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో తగ్గక ప్రైవేటుకు వెళ్లాం డెంగీ రావడంతో వారం రోజుల క్రితం ఫీవర్ ఆస్పత్రిలో చేరి ఐదు రోజులు చికిత్స తీసుకున్నాను. ప్లేట్ లెట్స్ తగ్గిపోతూనే ఉన్నాయి. మా ఇంట్లోవాళ్లు ఆందోళనతో ఫీవర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. – సాయి కిరణ్ (20), బాగ్ అంబర్‌పేట ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
ఎమర్జెన్సీలోనూ నార్మలే..! కడుపు కోతలకు చెక్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో సాధారణ కాన్పులపై దృష్టి సారించిన వైద్యారోగ్యశాఖ అధికారులు అత్యవసర సమయాల్లోనూ నార్మల్ డెలివరీ చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. తల్లికో, బిడ్డకో ప్రాణహాని ఉంటే తప్ప సిజేరియన్ డెలివరీ చేయకూడదు. కానీ సిజేరియన్ డెలివరీతో ఎదురుకానున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన లేకపోవడం, ముహూర్తాలు చూసుకుని ప్రసవాలు చేయడం వంటి కారణంగా చాలా మటుకు సిజేరియన్ డెలివరీకే మొగ్గు చూపుతుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గర్భిణులకు మొదటి వైద్య పరీక్షల నుంచి వారిలో సాధారణ ప్రసవాల ఆవశ్యకతపై ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది వారిలో అవగాహన పెంచుతున్నారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలో ఇచ్చే తల్లిపాలు బిడ్డకు జీవితాంతం రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదం చేస్తుందన్న విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ చర్యలు చాలా మట్టుకు ఫలితాలిస్తోంది. వారంపాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనూ వైద్యారోగ్యశాఖ ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. డెలివరీ తేదీలు దగ్గరలో ఉన్న గర్భిణులను ముందస్తుగా ప్రభుత్వాస్పత్రులకు, మాతాశిశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సర్కారు దవాఖానాలో గైనకాలజీ, మత్తు డాక్టర్లు లేనందున పూర్తిగా నార్మల్ డెలివరీలే జరుగుతున్నాయి. నార్మల్ డెలివరీ కావడం సంతోషంగా ఉంది నాలుగు రోజుల క్రితం నొప్పులు రావడంతో మా కుటుంబ సభ్యులు సిద్దిపేట గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు. ఒక రోజు అనంతరం నార్మల్ డెలివరీతో బాబు పుట్టాడు. సంతోషంగా ఉంది. నార్మల్ డెలివరీ గురించి రెండు నెలల క్రితం ఆస్పత్రికి వచ్చిన అప్పటి నుండే వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కావడంతో రూ.30వేల నుంచి రూ.40 వేలు ఆదా అయ్యింది. కేసీఆర్ కిట్ కూడా ఇచ్చారు. – పద్మ, బాలింత, నర్మెట నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలో.. గర్భిణితో వ్యాయామం చేయిస్తున్న ఈ దృశ్యం నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలోనిది. నార్మల్ డెలివరీ అయ్యేలా గర్భిణులకు ఇలా వ్యాయామంతోపాటు, కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో గర్భిణులకు సాధారణ ప్రసవాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. పడవలో వాగు దాటించారు పడవలో తీసుకొస్తున్న ఈ గర్భిణి పేరు మోర్రం పార్వతి. ములుగు జిల్లా రామచంద్రాపురం గ్రామం. గురువారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో ట్రాక్టర్లో పాత్రపురం తీసుకొచ్చి అక్కడి నుంచి పడవలో వాగు దాటించారు. అక్కడి నుంచి 108 వాహనంలో వెంకటాపురం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి అత్యవసర సమయంలోనూ వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెకు నార్మల్ డెలివరీ చేయగలిగారు. పార్వతికి పండంటి బాబు పుట్టాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ముందుజాగ్రత్త చర్యగా.. భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బీమారం గ్రామానికి చెందిన శ్రావణి అనే గర్భిణిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ సిబ్బంది మంచిర్యాలలోని మాతాశిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. రెండు రోజుల క్రితం వైద్యులు ఆమెకు నార్మల్ డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడటంతో నార్మల్ డెలివరీ అయిందని శ్రావణి తెలిపింది. చదవండి: నూతన జోనల్ విధానం ఆధారంగా గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు -
33 అంతస్తులు, 2000 పడకలు.. త్వరలో వరంగల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
సాక్షి ప్రతినిధి, వరంగల్: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా టి.హరీశ్‌రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరంగల్ పెద్దాసుపత్రి నిర్మాణం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దేశంలోనే ఆదర్శంగా ఉండేలా, అత్యాధునికంగా రూపుదిద్దుకునేలా çసరికొత్త నమూనా, సీఎం కేసీఆర్ బొమ్మ ఉన్న ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. పేదలకు పెద్దరోగమొస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పట్నంబాట పట్టే వరంగల్ ప్రాంతవాసుల కష్టాలకు త్వరలో తెరపడనుంది. 59 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,180 కోట్ల వ్యయంతో 33 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏడాదిన్నరలో అందుబాటులోకి రానుంది. వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం భారీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే విధంగాహెలీ అంబులెన్స్ సేవలు అందుబాటులోకిరానున్నాయి. ఈ ఆసుపత్రి నిర్మాణానికి వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో జూన్ 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రెండు వేల పడకలు.. 36 విభాగాలు... రెండువేల పడకల సామర్థ్యంతో తీర్చిదిద్దనున్న ఈ ఆ స్పత్రిలో 36 విభాగాలు పనిచేయనున్నట్లు వైద్య, ఆరో గ్య శాఖ ఉన్నతాధికారులు గతంలోనే వెల్లడించారు. సుమారు 500 మంది వైద్యులు, వెయ్యి మందికిపైగా నర్సులు, పారామెడికల్ సిబ్బందితోపాటు ఇతర సిబ్బంది ఇక్కడ పనిచేస్తారు. పది సూపర్ స్పెషాలిటీ విభాగాలతో రోగులకు సేవలందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరో సర్జరీతోపాటు, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ విభా గాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. కొత్తది అందుబాటులోకి వస్తే అన్నిరకాల వైద్య సేవలు, శస్త్రచికిత్సలు ఇక్కడే అందుతాయి. పర్యావరణహితంగా నిర్మాణం భారీ నిర్మాణం పూర్తిగా పర్యావరణహితంగా సాగనుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే జీవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తారు. పచ్చదనం వెల్లివిరిసేలా భవన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. కెనడా తరహా వైద్య విధానాలు, సౌకర్యాలతో ఆస్పత్రి నిర్మించాలని ఆయన అధికారులకు సూచించగా ఈ మేరకు భవనం మ్యాప్, ప్లాన్‌ను సీఎం దృష్టికి తెచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో కెనడా వైద్య విధానాలపై అధ్యయనానికి తెలంగాణ వైద్య నిపుణులు బృందం త్వరలో ఆ దేశానికి వెళ్లనుంది. -
90% యాంటిజెన్ పరీక్షలే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో 90 శాతంపైగా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులేనని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలపై వైద్య శాఖ ఒక నివేదిక తయారు చేసింది. ఈ సమయంలో మొత్తం 24,69,017 టెస్టులు చేయగా, అందులో 22,45,418 టెస్టులు (90.94%) యాంటిజెన్ పద్ధతిలో నిర్వహించినవేనని, కేవలం 9.06 శాతం మాత్రమే ఆర్టీపీసీఆర్ పద్ధతిలో చేశామని ఆ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 99.45 శాతం యాంటిజెన్ పరీక్షలే నిర్వహించారు. ఇక్కడ కేవలం 0.55 శాతమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. దీనివల్ల చాలావరకు.. కరోనా లక్షణాలుండి యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చినవారిలో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయకపోవడం వల్ల పాజిటివ్ కేసులు మిస్ అవుతున్నట్లు అంచనా వేశారు. వాస్తవంగా యాంటిజెన్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చి లక్షణాలుంటే, వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలన్నది నిబంధన. కానీ చాలామంది నెగెటివ్ రిపోర్ట్ రాగానే తమకు కరోనా లేదని సాధారణంగా తిరుగుతున్నారు. అటువంటి వారిలో కొందరికి సీరియస్ అవుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్ష అందుబాటులో లేకపోవడం, మరికొన్నిచోట్ల దాని ఫలితం ఆలస్యం కారణంగా అనేకమంది ఈ పరీక్షలను చేయించుకోవడంలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా త్వరలో కొత్తగా మరో 14 ఆర్టీపీసీఆర్ లేబొరేటరీలు అందుబాటులోకి రానుండటంతో ఈ పరీక్షల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. కాగా, తమిళనాడు రాష్ట్రంలో నూరు శాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలే చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ పాజిటివిటీ ఈ నెల ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 1.46 శాతంగా నమోదైందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అందులో అత్యంత తక్కువగా 0.36 శాతం పాజిటివిటీ రేటు ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. ఆ తర్వాత నిర్మల్ జిల్లాలో 0.40 శాతం, నాగర్‌కర్నూలు జిల్లాలో 0.66 శాతం, నిజామాబాద్ జిల్లాలో 0.69 శాతం పాజిటివిటీ నమోదైంది. కాగా, అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో 2.38 శాతం, ఖమ్మం జిల్లాలో 2.07 శాతం, రంగారెడ్డి జిల్లాలో రెండు శాతం పాజిటివిటీ నమోదైంది. -
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వారం కిందట వరకు దాదాపు 8 వేలకు నమోదైన కేసులు ఇప్పుడు ఐదు వేలకు చేరాయి. తాజాగా నమోదైన కేసులు 5,186 కాగా, 38 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 7,994 మంది చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మళ్లీ సాయంత్రం పూట కరోనా బులెటిన్ విడుదల చేయడం ప్రారంభించింది. నిన్నటి వరకు ఉదయం విడుదల చేస్తుండగా తాజాగా సాయంత్రానికి మార్చారు. తాజాగా శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఒక్క రోజులో 69,148 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షలు 1,35,57,646. కరోనా నుంచి కోలుకున్నవారు మొత్తం 4,21,219 మంది ఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 68,462. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 4,92,385. మొత్తం మృతుల సంఖ్య 2,704. అత్యధికంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. అత్యల్పంగా కొమురం భీం ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ చదవండి: ఒకేసారి నాలుగు ప్రాణాలు: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
రేపటి నుంచి కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ హాస్పిటల్
-
గాంధీ కోవిడ్ ఆస్పత్రి.. కరోనా రోగులకే సేవలు
సాక్షి, హైదరాబాద్, గాంధీ ఆస్పత్రి: రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటం, మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని మళ్లీ పూర్తి స్థాయి కోవిడ్ హాస్పిటల్‌గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు, సర్జరీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న సాధారణ రోగులను డిశ్చార్జి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో గాయపడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నవారిని ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. నాన్ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు గాంధీ ఆస్పత్రి పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వైద్య విద్యార్థుల అభ్యర్ధన మేరకు.. జనవరి నుంచి సాధారణ ఓపీ, ఇన్‌పేషెంట్ సేవలను కూడా ప్రారంభించారు. మొత్తం 1,890 పడకల్లో 300 పడకలను కోవిడ్ విభాగానికి కేటాయించి, మిగతా సేవలు అందించారు. అయితే కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. గాంధీలో కోవిడ్ బెడ్లను కూడా పెంచుతూ వచ్చారు. తాజాగా మళ్లీ పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో ఒక్క రోజే 152 మంది హెల్త్ సీరియస్‌గా ఉన్న కరోనా రోగులు అడ్మిట్ కావడం ఆందోళనకరంగా మారింది. గాంధీలో 400 వెంటిలేటర్, 1,250 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రోగుల సంఖ్య మరింత పెరిగితే ఓపీ విభాగం, లైబ్రరీ భవనాల్లో మరో 300 బెడ్లు అదనంగా ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి అధికారులు రంగం సిద్ధం చేశారు. సాధారణ రోగులకు ఇబ్బంది ప్రస్తుతం గాంధీలో 462 మంది కోవిడ్, 923 మంది నాన్ కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. నాన్ కోవిడ్ విభాగంలో సాధారణ సమస్యలతో చికిత్స పొందుతున్నవారు 75 శాతం వరకు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే వారిని డిశ్చార్జి చేయడం మొదలుపెట్టారు. అయితే ఇలా హఠాత్తుగా డిశ్చార్జి చేసి ఆస్పత్రి నుంచి వెళ్లిపొమ్మంటుండటంతో రోగులు, వారి బంధువులు అయోమయానికి గురవుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన రోగులు అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆందోళనలో పడ్డారు. ఆర్థిక స్తోమత లేకపోయినా కూడా కొందరు అనివార్య పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు ఉస్మానియా దాదాపు ఫుల్ ఉస్మానియా పాత భవనం శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే ఆ భవనాన్ని ఖాళీ చేశారు. ఆస్పత్రిలో ప్రస్తుతం ఓపీ, కులీకుతుబ్‌షా భవనంలో కలిపి 948 పడకలు అందుబాటులో ఉండగా.. ఇప్పటికే 630 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఇక గాంధీ నుంచి పెద్ద సంఖ్యలో రిఫరల్‌పై వచ్చే రోగులను ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియక వైద్యులు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉస్మానియాకు రోజూ సగటున 1,800 నుంచి 2,000 వరకు ఓపీ రోగులు వస్తున్నారు. గాంధీ మూతపడటంతో ఈ సంఖ్య మరింతగా పెరగనుంది. ఈ పరిస్థితుల్లో ఓపీ, ఇన్‌పేషెంట్లకు చికిత్స ఎలాగన్న ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు ఈఎస్ఐ, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏరియా ఆస్పత్రుల్లో బెడ్లు పెంపు రోగుల రద్దీ నేపథ్యంలో ప్రస్తుతమున్న కోవిడ్ ఆస్పత్రులకు అదనంగా.. కొత్తగా నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో 8, హయత్‌నగర్ సీహెచ్‌సీలో 6, జంగమ్మెట్, సీతాఫల్మండిలో 10 పడకల చొప్పున, శ్రీరాంనగర్ యూసీహెచ్‌సీలో ఐదు పడకలు అదనంగా సమకూర్చారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే.. ‘‘కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకే గాంధీని కోవిడ్ ఆస్పత్రిగా మార్చుతున్నారు. గాంధీలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలు, ఇతర వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఇక్కడ శనివారం నుంచి కేవలం కోవిడ్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సీరియస్‌గా ఉన్న 462 మంది కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాం.’’ -రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ హైదరాబాద్‌లోని పలు కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు, రోగుల లెక్క ఇదీ.. ఆస్పత్రి మొత్తం బెడ్లు రోగులు గాంధీ ఆస్పత్రి 1,890 424 టిమ్స్ 1,261 455 ఈఎస్ఐ 109 102 కొండాపూర్ 110 09 కింగ్‌కోఠి 350 240 చెస్ట్ ఆస్పత్రి 123 53 చదవండి: సాధారణ కరోనా రోగులకు బెడ్స్ లేనట్టే..! కర్ణాటక సీఎం యడ్యూరప్పకు మళ్లీ పాజిటివ్.. ఆస్పత్రికి తరలింపు -
సాధారణ కరోనా రోగులకు బెడ్స్ లేనట్టే..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుత పడకలకు అదనంగా మరో 25 శాతం కరోనా రోగులకు కేటాయించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ వైద్య సేవలను, వాయిదా వేయదగిన (ఎలెక్టివ్) శస్త్ర చికిత్సలను నిలిపేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఇంకా కేసులు పెరిగినట్లయితే ఈ పడకలను కరోనాకు అదనంగా కేటాయించడం వల్ల బాధితులకు మేలు జరుగుతుందని భావిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలో కరోనా కేసుల పెరుగుదలపై గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అధికారులు జయేశ్ రంజన్, రిజ్వీ, ప్రీతి మీనా, రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, టి.గంగాధర్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని, టీకాలు విరివిగా వేయాలని, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, కరోనా జాగ్రత్తలను పాటించాలని ప్రజలకు సూచించారు. వీటి అమలుపై జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఆక్సిజన్ వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం. సాధారణ రోగులకు ఇళ్లల్లోనే చికిత్స.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగులను మూడు విభాగాలుగా చేయాలని నిర్ణయించారు. సాధారణ కరోనా పాజిటివ్ వచ్చిన వారు.. మధ్య స్థాయి రోగులు.. సీరియస్ రోగులు. సాధారణ రోగులను ఇళ్లల్లోనే ఉంచి చికిత్స చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ఆస్పత్రుల్లో పడకలు కేటాయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. మధ్యస్థాయి లక్షణాలున్న రోగులకు అవసరాన్ని బట్టి సాధారణ వైద్యం అందించి రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలని నిర్ణయించింది. ఇక సీరియస్ రోగులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు పడకలు కేటాయించాలని ఆదేశించింది. పడకలు, ఆక్సిజన్ వాడకం, రెమిడెసివిర్ ఇంజెక్షన్ల వినియోగం వంటి వాటి వాడకాన్ని క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. అనవసరంగా వాడకూడదన్నారు. కొన్ని ఆస్పత్రుల్లో గతంలో కరోనా చికిత్సలో వాడిన మందులను ఇప్పుడు నిలిపేయగా, వాటిని వాడుతూ లక్షలు గుంజుతున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆ మందుకోసం ఏకంగా రూ.లక్ష వసూలు చేశారని అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇలాంటివి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రొటోకాల్స్‌పై ప్రైవేట్ వైద్యులకు శిక్షణ.. కరోనా రోగులకు ఎలాంటి మందులు ఇవ్వాలన్న దానిపై గురువారం ప్రైవేట్ వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కొందరికి నేరుగా, మరికొందరికి వర్చువల్ పద్ధతిలో శిక్షణ ఇచ్చారు. కరోనాకు డాక్టర్లు ఎవరికి వారు సొంత వైద్యం చేయకూడదని, నిర్ణీత పద్ధతిలో మందులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. బాధితులకు కింది జాగ్రత్తలు చెప్పాలని, మందులు సూచించాలని పేర్కొంది. కరోనా జాగ్రత్తలు, మందులు కరోనా రోగులు ప్రత్యేకమైన గదిలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. రోగితో పాటు ఇంట్లో అందరూ మాస్కు ధరించాలి. వ్యాధితో ఉన్న వారికి రోజూ పరిశీలించాల్సినవి.. జ్వరం: థర్మామీటర్ ద్వారా 3 పూటలూ చూసుకోవాలి. ఊపిరి బిగబట్టగల సమయం: 20 సెకండ్ల కన్నా ఎక్కువ ఉండాలి. 6 నిమిషాలు నడిచినా ఆయాసం రాకూడదు. పల్స్ రేట్: 100 కన్నా మించకూడదు. ఆక్సిజన్ శాతం: 94 కన్నా తగ్గకూడదు. కింది మందులు రాసివ్వాలి.. పారాసిటమాల్ మాత్ర: రోజుకు రెండు (ఉదయం/రాత్రి) – 5 /10 రోజులు బీ కాంప్లెక్స్ మాత్ర: రోజుకు ఒకటి (ఉదయం)– పది రోజులు విటమిన్–డి మాత్ర: రోజుకు ఒకటి 5/10 రోజులు విటమిన్–సి మాత్ర: రోజుకు ఒకటి.. 10 రోజులు లివో సిట్రజిన్ మాత్ర: రోజుకు ఒకటి 5/10 రోజులు రానిటిడిన్ మాత్ర: రోజుకు ఒకటి (ఉదయం) – 5/10 రోజులు డాక్సిసైక్లిన్ మాత్ర: రోజుకు రెండు (ఉదయం/రాత్రి)– 5 రోజులు జ్వరం తగ్గకుండా ఉంటే, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే (దమ్ము రావడం), ఛాతీలో నొప్పిగా ఉంటే, ఇతర ఆరోగ్య ఇబ్బందులు ఉంటే 108కు ఫో¯Œ చేసి, దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందాలి. చదవండి: వ్యాక్సిన్ కోసం తరలొస్తున్నారు.. -
కరోనా కేసులపై వైద్యశాఖ కీలక నిర్ణయం..!
సాక్షి, హైదరాబాద్: సీరియస్ కరోనా రోగులకే ఆసుపత్రుల్లో పడకలు కేటాయించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. సాధారణ లక్షణాలతో కరోనా వచ్చిన వారికి ఆసుపత్రుల్లో ఐసోలేషన్ పడకలు అవసరం లేదని తేల్చిచెప్పింది. అటువంటి వారి కోసం కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అక్కడకు వెళ్లాలని సూచించింది. ఒకవేళ ఎవరైనా అలాంటి బాధితులు ఆసుపత్రులకు వచ్చినా, వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు పంపాల్సిన బాధ్యత ఆసుపత్రి వర్గాలదేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ రోగులను మూడు వర్గాలుగా విభజించింది. ఒకటి కరోనా పాజిటివ్ వచ్చిన సాధారణ రోగులు. రెండు కరోనా వచ్చాక ఆక్సిజన్ అవసరమైన వారు. మూడు వెంటిలేటర్ లేదా ఐసీయూ అవసరమైన వారుగా విభజించింది. ఇందులో మొదటి వర్గం వారికి కరోనా పాజిటివ్ వచ్చినందున ఐసోలేషన్ కేంద్రాలకు పంపాలి లేదా వారిని ఇళ్లల్లోనే ఉంచి చికిత్స అందించాలి. ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరమైన వారికే ఆసుపత్రుల్లో బెడ్స్ కేటాయించాలి. రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో 44 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వాటిల్లో 4,013 ఐసోలేషన్ పడకలను సిద్ధంగా ఉంచింది. వీటిల్లో సాధారణ కరోనా రోగులు చికిత్స తీసుకోవచ్చు. వారికి అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కరోనా కాకుండా ఇతర వ్యాధులకు చికిత్స కోసం వచ్చే వారిలో తప్పనిసరి కేసులకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. వాయిదా వేసే చికిత్సలు, వైద్యానికి సంబంధించి రోగులను ఇప్పుడే తీసుకోకూడదని నిర్ణయించారు. సాధారణ పడకలకూ ఆక్సిజన్ సదుపాయం కరోనా విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. వచ్చే మూడు నెలల్లోనే గతేడాది అవే నెలలతో పోలిస్తే మూడింతల కేసులు నమోదు అయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. కేసుల సరళి పరిశీలించినా అదే కనిపిస్తోంది. ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో కరోనా పడకల కొరత ఏర్పడింది. మున్ముందు ఇంకా కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలనేది వైద్య ఆరోగ్యశాఖ ఆలోచన. అయితే ఇప్పటివరకు ఆసుపత్రుల్లో కరోనా కోసం సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ లేదా వెంటిలేటర్ పడకలుగా వర్గీకరించి ఆ ప్రకారం నింపుతున్నారు. మొత్తం 61 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా కోసం 8,542 పడకలు కేటాయించగా, అందులో 1,551 సాధారణ పడకలున్నాయి. మిగిలినవి ఆక్సిజన్, ఐసీయూ పడకలు. ఇక 244 ప్రైవేట్ కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 11,778 పడకలు కరోనాకు కేటాయించగా, అందులో 4,657 సాధారణ పడకలు ఉన్నాయి. వీటిల్లో 3,924 ఆక్సిజన్, 3,197 ఐసీయూ లేదా వెంటిలేటర్ పడకలున్నాయి. ఇలా సాధారణ పడకలు అధికంగా ఉండటంతో సీరియస్ రోగులకు బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడుతుందని సర్కారు భావన. అందుకే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సాధారణ పడకలకూ ఆక్సిజన్ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఆక్సిజన్ వసతిని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్ -
హైదరాబాద్‌లో ఉచితంగా 57 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఇకపై ఎక్స్ రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, రేడియాలజీ పరీక్షలు ఉచితంగా అందనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో 8 తెలంగాణ డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. లాలాపేట, శ్రీరాంనగర్, అంబర్పేట్, బార్కాస్, జంగంపేట, పానీపురా, పురానాపూల్, సీతాఫల్‌మండిల్లో ఉప ముఖ్యమంత్రి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు. బస్తీ దవాఖానాల్లో పేదలకు ఉచిత వైద్య పరీక్షల కోసం డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పేదలు వేలాది రూపాయలు ఖర్చుచేసి వేద్యం చేయించుకునే పరిస్థితి లేదని, వారికి అందుబాటులో ఉండేలా డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారని లాలాపేట డయాగ్నొస్టిక్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆస్పత్రిలో రూ.35 కోట్లతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 57 రకాల పరీక్షలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీరామ్‌నగర్‌లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఐ, ఆల్ర్టా సౌండ్, సిటీ స్కాన్ వంటి పరీక్షలు కూడా అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్ వివరించారు. డయాగ్నోస్టిక్ సెంటర్లలో మొత్తం 57 రకాల రక్త పరీక్షలను చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్లను భవిష్యత్‌లో జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. -
మరింత మెరుగ్గా ప్రాథమిక వైద్యం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువగా ప్రాథమిక వైద్య సేవలు అందించేలా తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు విజయవంతంగా నడుస్తుండగా, ఇతర పట్టణాల్లోనూ నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. బస్తీ దవాఖానాల్లో ఒక డాక్టర్, నర్సు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. దాదాపు ఐదు వేల జనాభాకు ఒక బస్తీ దవాఖానా లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 2 నడుస్తున్నాయి. ప్రస్తుతం వాటిల్లో 65 రకాల పరీక్షలు చేస్తున్నారు. గతేడాది డెంగీ పరీక్షలు కూడా నిర్వహించారు. ఇకనుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ మోడల్‌గా పూర్వ జిల్లా కేంద్రాల్లోనూ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ( చదవండి: తెలంగాణ: సర్కారీ మెడికల్ షాపులు! ) ఉప కేంద్రాలే వెల్నెస్ సెంటర్లు... పల్లెవాసులకు మెరుగైన వైద్యసేవల కోసం ఆరోగ్య ఉప కేంద్రాల బలోపేతంపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో 4,905 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వాటిని హెల్త్ వెల్నెస్ సెంటర్లుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. వీటిలో ఏఎన్ఎంలే ప్రస్తుతం కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం టీకాలు ఇవ్వడం, గర్భిణులు, పిల్లలకు మందులివ్వడంలాంటి సేవలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో త్వరలో నర్సులను నియమించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. షుగర్, బీపీ చెక్ చేయడంతోపాటు ఇతర వైద్య సేవలు అందించేలా వీటిని బలోపేతం చేస్తారు. పైగా నర్సులకు ప్రత్యేకంగా మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌పీ) హోదా ఇస్తారు. నర్సులుగా నియమితులవ్వడానికి బీఎస్సీ నర్సింగ్ అర్హతగా నిర్ణయించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కిందిస్థాయిలో ఇవి పనిచేస్తాయి. రోగులను ఉప కేంద్రాల నుంచి వీటికి రిఫర్ చేస్తారు. వీటిల్లోనూ మున్ముందు కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఒక వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి తెలిపారు. -
తెలంగాణలో కరోనా మరణాలు అరికట్టాలి
-
డెంగీ కేసుల్లో తెలంగాణకు రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: డెంగీ కేసుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బృందం వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 13,200 కేసులతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 8,564 కేసులతో రెండో స్థానంలో, ఉత్తరాఖండ్ 8,300 కేసులతో మూడో స్థానంలో ఉందని తెలిపింది. డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర బృందం సీఎస్ ఎస్.కే జోషి నిర్వహించిన సమావేశంలో పాల్గొంది. అనంతరం కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయానికి చేరుకుని డెంగీ నిర్మూలనకు చేపడుతున్న చర్యలను పరిశీలించింది. రాష్ట్రంలో డెంగీ నివారణకు ఏర్పాటు చేసిన కేంద్ర నోడల్ ఆఫీసర్, జాతీయ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సుమన్ లతా పటేల్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) కన్సల్టెంట్ కౌషల్ కుమార్‌లు ‘సాక్షి’తో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 78 వేల డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. అందులో 58 మంది మరణించారన్నారు. తెలంగాణలో ఇద్దరు డెంగీ కారణంగా మరణించారని, కర్ణాటకలో 12 మంది, ఉత్తరాఖండ్‌లో 8 మంది డెంగీతో మరణించారన్నారు. తెలంగాణలో 40 నుంచి 50% వరకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాలోనే నమోదయ్యాయన్నారు. ఎక్కువ రోజులు వర్షాలు కురవడం వల్లే ఈ ఏడాది ఎక్కువ రోజుల పాటు వర్షాలు కురవడం వల్లే డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయని కేంద్ర బృందం అంగీకరించింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 18 డెంగీ వ్యాధి నిర్ధారణ కేంద్రాలుంటే, ఈ ఏడాది 28కి పెరిగాయన్నారు. గతేడాది తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో డెంగీ వ్యాధి నిర్ధారణ కేంద్రాలు పెద్దగా లేవని, కానీ ఈ ఏడాది ఏకంగా 350 చోట్ల వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు జరిగాయన్నారు. ఇటీవలకాలం వరకు రోజుకు 100 వరకు డెంగీ కేసులు నమోదు కాగా, ఇప్పుడు రోజుకు 50కి పడిపోయాయన్నారు. డెంగీ నివారణకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయని బృందం స్పష్టం చేసింది. కీటక జనిత వ్యాధుల నివారణకు ప్రణాళిక గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో కీటక జనిత వ్యాధుల నిరోధానికి ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ జోషి ఆదేశించారు. రాష్ట్రంలో వ్యాధులపై బి.ఆర్.కె.ఆర్.భవన్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కమిషనర్ యోగితారాణా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్‌రావు, కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. -
‘ఆఫ్’గ్రేడ్..!
పరకాల: ఈ రోజుల్లో వైద్యం అత్యంత ఖరీదుగా మారింది. పేదలకు అందని ద్రాక్షలా మారింది. ప్రతి కుటుంబ సంపాదనలో అధిక మొత్తం ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారనేది నిత్య సత్యం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చూయించుకుందామంటే అరకొర వసతులు, నాణ్యమైన వైద్యం పొందలేక పోతున్నారు. ప్రజలు అవసరాలకు అనుగుణంగా మెరుగైన వసతుల కల్పనలో పాలకులు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల పేదల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. ఈ కోవకే వస్తుంది పరకాల సివిల్ ఆస్పత్రి. చుట్టూ వందల గ్రామాలకు పెద్దదిక్కుగా ఉన్న ఆస్పత్రి అప్‌గ్రేడ్‌కు ఇప్పటికే రెండుసార్లు ప్రతిపాదనలు చేసినా మొగ్గ దశలోనే వాడిపోయాయి. అయితే ఈ ప్రాంత సరిహద్దు మండలం కమలాపూర్‌కు చెందిన ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో వంద పడకల ఆస్పత్రికి చేసిన ప్రతిపాదనలకు తోడుమరో 150 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలంటూ మంత్రికి విన్నవించుకునేందుకు ప్రతిపాదనలు చేయాలని వైద్యాధికారులను స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి పరకాల సివిల్ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని కోరనున్నట్లు తెలిసింది. మూడు జిల్లాలకు పెద్ద దిక్కు.. వరంగల్ రూరల్, అర్బన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 8 మండలాలుకు చెందిన సుమారు 150 గ్రామాలతో పాటు మహారాష్ట్రకు చెందిన నిరుపేదలకు పరకాల సివిల్ ఆస్పత్రి పెద్దదిక్కుగా నిలుస్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎంజీఎం ఆస్పత్రి తర్వాత ఎక్కువ మంది రోగులు వైద్యం అందించే పరకాల సివిల్ ఆస్పత్రిఇ పట్టిన జబ్బును నయం చేసేవారు కనిపించలేదు. పొరుగున ఉన్న చిట్యాల, కమలాపూర్ వంటి మండల స్థాయి పీహెచ్‌సీలు వంద పడకలుగా మారినా పరకాల ఆస్పత్రిఇ మాత్రం ఆ భాగ్యం లభించలేదు. నిత్యం వందలాది మంది రోగులతో కిట కిటలాడే ఆస్పత్రి పుట్టెడు కష్టాలతో తల్లడిల్లుతుంది. ప్రసుత్తం ఉన్న 30 పడకల ఆస్పత్రి భవనంలోనే బాలింతలను, ఇన్పెషంట్లకు వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకల ఆస్పత్రి చేస్తామంటూ పాలకులు చేసిన హామీలు నెరవేరలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల శాతం పెంచడానికి కేసీఆర్ కిట్లను అందజేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ప్రతి నిరుపేద రోగికి సకాలంలో మెరుగైన వైద్యసేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కొత్తగా రూ.45 కోట్లతో ప్రతిపాదనలు..! పరకాల సివిల్ ఆస్పత్రిని 250 పడకలు దవఖానాగా మార్చాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరాలని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే 250 పడకల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. గతంలో రెండు సార్లు.. పెరుగుతున్న రోగుల సంఖ్యతో పాటు శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో 100 పడకల ఆస్పత్రి చేయాలంటూ 2012 సంవత్సరంలో ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సారథ్యంలోని అప్పటి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ రూ.5కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలకు తీర్మానం చేయగా 2015 సంవత్సరంలో ప్రస్తుత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూ.23 కోట్లతో మరో విడతగా ప్రతిపాదనలు చేయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రూ.1.50 కోట్లతో మొదటి అంతస్తు భవన నిర్మాణపు పనులకు మంజూరు ఇచ్చిన భవన పనులు జరుగలేదు. మూడో విడతగా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 250 పడకల ఆస్పత్రి కోసం రూ.45కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ను కోరనున్నట్లు తెలిసింది. -
ఆరోగ్యశాఖకు రోగం వచ్చింది: మల్లు రవి
హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య శాఖకు రోగం వచ్చిందని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. రాష్ట్రంలో ఆరోగ్యం పడకేసిందని ఆరోపించారు. నిలోఫర్ ఆస్పత్రిలో సరిపడా మందులు లేక గర్భిణీలు చనిపోవడం దారుణమన్నారు. ఆరుగురు బాలింతల చావుకు ప్రభుత్వానిదే బాధ్యతని చెప్పారు. ప్రభుతాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. నిలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఇటీవలి కాలంలో సంభవించిన వరుస చావులపై ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరారు. అదేవిధంగా గాంధీ ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.