తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు | Telangana: May 8th Corona Bulletin Released | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Published Sat, May 8 2021 7:16 PM | Last Updated on Sat, May 8 2021 7:20 PM

Telangana: May 8th Corona Bulletin Released - Sakshi

తెలంగాణలో దాదాపు పదివేలకు చేరువగా నమోదవుతున్న కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వారం కిందట వరకు దాదాపు 8 వేలకు నమోదైన కేసులు ఇప్పుడు ఐదు వేలకు చేరాయి. తాజాగా నమోదైన కేసులు 5,186 కాగా, 38 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 7,994 మంది చికిత్స పొందుతూ డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మళ్లీ సాయంత్రం పూట కరోనా బులెటిన్‌ విడుదల చేయడం ప్రారంభించింది. నిన్నటి వరకు ఉదయం విడుదల చేస్తుండగా తాజాగా సాయంత్రానికి మార్చారు. 

తాజాగా శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఒక్క రోజులో 69,148 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షలు 1,35,57,646. కరోనా నుంచి కోలుకున్నవారు మొత్తం 4,21,219 మంది ఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 68,462. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 4,92,385. మొత్తం మృతుల సంఖ్య 2,704. అత్యధికంగా హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. అత్యల్పంగా కొమురం భీం ఆసిఫాబాద్‌, నారాయణపేట జిల్లాలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌
చదవండి: ఒకేసారి నాలుగు ప్రాణాలు: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement