సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి దళితుడని మద్దతు ఇస్తున్నట్టుగా చెప్పడం పచ్చి వంచన అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. ఏఐసీసీ ఆదివాసీ సెల్ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌తో కలిసి గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితుడిని సీఎం చేస్తానని ఆ పదవిలో కూర్చున్న కేసీఆర్ వారికి ఇస్తానన్న మూడెకరాల భూమిని కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
పేదలకు రెండు పడక గదుల ఇళ్లు, విద్యార్థులకు ఫీజును రీయింబర్స్ బకాయిలు చెల్లించకుండా మోసం చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ను గెలిపించడానికి డిల్లీకి వెళ్లిన కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకున్న తర్వాతనే హైదరాబాద్‌కు తిరిగిరావాలని డిమాండ్ చేశారు. మతతత్వ రిజర్వేషన్లను వ్యతిరేకించిన బీజేపీ అభ్యర్థికి ఆయన ఎలా మద్దతును ఇస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.
దళితులను మోసం చేస్తూ ఎన్డీయేకు మద్దతా
Published Thu, Jun 22 2017 8:23 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM
Advertisement