హైదరాబాద్: ఆరోగ్యశ్రీ విజయవంతం అయితే కాంగ్రెస్‌కి ఎక్కడ పేరు వస్తుందోనని సీఎం కేసీఆర్ నిధులు ఇవ్వటం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లు రవి విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు ఇవ్వకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందన్నారు. ఇలాంటి చర్యలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకమని తేలిపోయిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కాకపోతే నష్టపోయేది పేదలేనని అన్నారు.
ప్రచారానికి, ఆడంబరానికి వందల కోట్లు ఖర్చు చేస్తోన్న ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీకి కేటాయించడాని డబ్బులు లేవా అని ప్రశ్నించారు. న్యాయాధికారుల సస్పెన్షన్స్ ఎత్తివేసి వారితో చర్చలు జరపాలన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకుండా చర్చలకు రమ్మనడం సరికాదన్నారు. న్యాయాధికారుల సమస్య, హైకోర్టు విభజనపై ఇద్దరు సీఎంలతో చర్చించేందుకు ప్రధాని మోదీ చొరవ చూపాలన్నారు.