తెలంగాణలో రాజ్యహింస పెరిగింది: మల్లు
హైదరాబాద్: తెలంగాణలో రాజ్యహింస పెరిగిందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి మల్లు రవి విమర్శించారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తుందని.. టీఆర్‌ఎస్ అనడం సిగ్గు చేటన్నారు. దళితుల మీద థర్డ్ డిగ్రీ జరిపితే.. ఒక దళిత ఎంపీగా బాల్క సుమన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సిరిసిల్ల లోకల్ ఎమ్మెల్యే కేటీఆర్ నోరు విప్పలేదు కాబట్టే.. కాంగ్రెస్ బాధితులకు అండగా ఉంటుందన్నారు. ఆర్గనైజేషన్‌లో ఎవరు ఎక్కడ ఉండాలన్నది అధిష్టానం చూసుకుంటుందని వివరించారు.