కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు | congress leader mallu ravi slams minister ktr | Sakshi
Sakshi News home page

కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు

Published Fri, Apr 7 2017 3:26 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు - Sakshi

కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు

హైదరాబాద్‌: కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టండి అంటూ కేటీఆర్ మాట్లాడటం అనుచితం. మంత్రిగా ఉన్న వ్యక్తి చెప్పులతో కొట్టండి, తరిమికొట్టండి అంటూ వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం. టీఆర్‌ఎస్‌ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనం. భద్రాచలంలో శ్రీరాముడి కల్యాణానికి ప్రభుత్వం తరుపున .. కేసీఆర్ మనవడు పట్టుబట్టలు సమర్పించడం రాచరికపు పోకడకాక మరేంటని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి ప్రశ్నించారు.
 
ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఏ అర్హతతో కేసీఆర్‌ మనవుడు పట్టువస్ర్తాలు సమర్పించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో చేసిన హామీలనే ఇంతవరకు నెరవేర్చడం లేదు. దేశంలో మాట తప్పడంలో మెదటి స్థానంలో నిలిచే ముఖ్యమంత్రి కేసీఆర్. టీఆర్‌ఎస్‌ సర్కార్ చెప్పేదొకటి .. చేసేదొకటి. కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోసేందుకే కేటీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తున్నట్లుగా వుంది. వాస్తవాలు జనానికి తెలుసు.. కాంగ్రెస్ ఏమీ చేయలేదంటే ప్రజలు నమ్మరు. గొర్రెలు .. చేపలు పంపిణీ ఇప్పుడు కొత్త కాదు .. కాంగ్రెస్ హయాం లో ఇలాంటి స్కీంలు చాలా చేసింది. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి .. లేకుంటే మేం కూడా అదే స్థాయిలో మాట్లాడాల్సి వస్తుందని’’ హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement