
దక్షిణ తెలంగాణపై వివక్ష : మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టులు, సాగునీటి విషయంలో దక్షిణ తెలంగాణకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిచేయడంలేదన్నారు.
ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు 90 శాతం పూర్తయినా 10 శాతం పనులను మూడేళ్లుగా ఎందుకు పూర్తి చేయడంలేదని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుకు తగిన ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపట్టకపోతే ఉద్యమం చేయాల్సి వస్తుందని మల్లు రవి హెచ్చరించారు.