
టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో టీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న సభ కోసం పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేశారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. గురువారం ఇక్కడ గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూలి డబ్బుల పేరుతో అధికార టీఆర్‌ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.
టీఆర్‌ఎస్ నేతలు బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కు భయపడి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున కూలి పేరిట నిధులను ఇచ్చారన్నారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడాల్సి ఉన్నా విద్యార్థులు చెప్పులు వేస్తారని, నల్ల జెండాలు ఎగురవేస్తారని భయపడి ప్రసంగించలేదని మల్లు రవి ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడలేని అసమర్థ పాలనను రాష్ట్రపతి స్వయంగా చూశారని పేర్కొన్నారు.