
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు భయపడుతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి లక్ష్మారెడ్డి కళ్లున్నా చూడలేని కబోది అని విమర్శించారు.
ప్రజల నుంచి వచ్చిన స్పందన, ఆదరణ గురించి నిఘా వర్గాలను అడిగి తెలుసుకోవాలని సూచించారు.సీఎం కేసీఆర్‌ను నమ్మించడానికి ఈ సభ గురించి మంత్రి తప్పుగా మాట్లాడుతున్నారని రవి అన్నా రు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడు తున్న లక్ష్మారెడ్డి గతంలో ఏ పార్టీలో ఉన్నా రో చెప్పాలన్నారు. మంత్రులంతా టాకింగ్ డాల్స్ లాగా మారారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment