సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్రమవుతున్న ప్రమాదకరమైన కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించే కార్యాచరణపై చర్చించి ప్రణాళిక ఖరారు చేయడానికి వెంటనే అఖిలపక్షాన్ని పిలవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ పద్ధతిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, ఈ సమయంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను, ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాలను పెంచాలని, తీవ్రత లేని వారికి ఇంట్లోనే చికిత్స చేసి, తీవ్రమైన కేసులను మాత్రమే ఆసుపత్రులలో చేర్చాలని మల్లు రవి కోరారు. ఈ వ్యాధి చికిత్సపై ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు మార్గదర్శకాలు జారీ చేయాలని, చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment