
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షులను కొనసాగిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. శనివారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆయన ఇంటికి చేరుకొని బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఉత్తమ్ కు çపుష్ప గుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లు రవి, గుడూరు నారాయణ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, యూత్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద, రంగారెడ్డి జిల్లా నాయకులు క్యామ మల్లేశం, బి.లక్ష్మారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, వరంగల్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment