ఆ ప్రాజెక్టుల ఘనత వైఎస్‌దే : మల్లు రవి
ఆ ప్రాజెక్టుల ఘనత వైఎస్‌దే : మల్లు రవి
Published Fri, Jul 22 2016 3:50 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. ఈ ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్ వ్యవహారం సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిదిలా మారిందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాయిదా పడినట్లు మల్లు రవి తెలిపారు.
Advertisement
Advertisement