
అభిప్రాయ భేదాల్లేని రాజకీయపార్టీ ఉందా?
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీల్లో విభే దాలు సహజమేనని, భేదాభిప్రాయాల్లేని రాజకీయ పార్టీ ఏదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నిం చారు. మంగళవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఎన్ని అభిప్రా యభేదాలున్నా వచ్చే ఎన్నికల్లో కనీసం 70 స్థానాల్లో పార్టీ గెలిచి, అధికారంలోకి వస్తుందన్నారు.
విభేదాలపై పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడి, పరిష్క రించుకుంటామని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం విన్నామని, అయితే సమాచారం లేకుండా మాట్లాడలేనన్నారు. నల్లగొండ ఎంపీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజీనామా చేస్తే ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మల్లు రవి చెప్పారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై టీఆర్‌ఎస్ గూండాల దాడి హేయమైన చర్యన్నారు. రైతు సమితులన్నీ టీఆర్‌ఎస్ కమిటీలే అన్నారు.