
టీపీసీసీ అధ్యక్షుడే సీఎం అభ్యర్థి: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నవారే వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఉంటారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపై అనుమానాలు, చర్చలేమీ లేవన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోనే 2019 ఎన్నికలకు వెళతామన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీల ను అమలు చేయడం లేదని విమర్శిం చారు. సమస్యలను పరిష్కరించాలని ఉద్యమాలు చేసినా, నిరసనలను వ్యక్తం చేసినా సీఎం కేసీఆర్ స్పందించడంలేదన్నారు. ఆశ వర్కర్స్, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాలు చేస్తే మూడేళ్ల పాటు పట్టించుకోలేదని విమర్శించారు. ఆశ వర్కర్లకు రూ.9000 వేలు ఇవ్వాలని మల్లు రవి డిమాండ్ చేశారు.