హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన 123 జీవో రైతుల హక్కులను కాలరాస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. భూసేకరణ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ టీపీసీసీ కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడో విడత రుణమాఫీని ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు.
కోదండరామ్‌పై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎదురు దాడి చేస్తోందని విమర్శించారు. దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు గులాబీ రంగు వేయడంపై అన్ని జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
రైతుల హక్కులను కాలరాస్తున్న సర్కారు: మల్లు రవి
Published Sun, Jun 12 2016 4:31 PM | Last Updated on Mon, Oct 1 2018 4:26 PM
Advertisement