నల్లగొండ నేతలతోనే కాంగ్రెస్‌కు అధికారం | congress again leading with nallagonda leaders | Sakshi
Sakshi News home page

నల్లగొండ నేతలతోనే కాంగ్రెస్‌కు అధికారం

Published Sat, Mar 11 2017 2:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నల్లగొండ నేతలతోనే కాంగ్రెస్‌కు అధికారం - Sakshi

నల్లగొండ నేతలతోనే కాంగ్రెస్‌కు అధికారం

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య శుక్రవారం మీడి యా పాయింట్‌ వద్ద సరదా సంభాషణ జరిగింది. ‘ఇద్దరు ఎమ్మెల్యేలే మిగిలారా’ అని రేవంత్‌రెడ్డిని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నిం చగా.. ‘మీ పార్టీ పరిస్థితీ అంతేకదా’ అని రేవంత్‌ సమాధానం ఇచ్చారు. ‘టీఆర్‌ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం.

టీపీసీసీ అయినా, సీఎల్పీ అయినా నల్లగొండ నాయకుల చేతుల్లోనే ఉంది. భవిష్యత్తులోనూ నల్ల గొండ జిల్లా నాయకులతోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ‘మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జైపాల్‌రెడ్డి, డీకే అరుణకు అర్హతల్లేవా’ అని రేవంత్‌ ప్రశ్నించగా.. ‘జైపాల్‌ జాతీయ నాయకుడు, కేంద్రంలో మంచి అవకాశాలిచ్చి పార్టీ గౌరవించుకుంటుంది’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement