న్యూఢిల్లీ: పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. గత ఆరు నెలల నుంచి నా పని నేను చేసుకుంటుంటే కొందరు నాపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతానని తాను ఎక్కడ అనలేదని.. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు.
పార్టీకి పదవికి రాజీనామా చేసి ప్రజల సమక్షంలో బీజేపీలో చేరితే.. తనని రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి తనమీద కుతంత్రాలు చేశారని ఫైర్ అయ్యారు. మునుగోడు ఎన్నికలు నైతిక విజయం తనదే అని అందరికీ తెలుసని.. కేసీఆర్ అవినీతి డబ్బుతో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్‌లో పొరాడానని,రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన నియంత పోవాలని ప్రజల కోసం పోరాటము చేశానన్నారు.
తెలంగాణ ప్రజలు దుబ్బాక, హైదరాబాద్ మేయర్ ఎన్నికలు హుజురాబాద్ ఎన్నికల్లో క్లియర్ మెజార్టీతో బీజేపీని గెలిపించారని, బీఆర్ఎస్ ని ఓడించాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీతోనే సాథ్యమని చెప్పారు. డబ్బు కోసం పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని, పారదర్శకంగా తమకు గ్లోబల్ టెండర్ వచ్చిందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment