
సాక్షి, న్యూఢిల్లీ: నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీయే పోటీ చేస్తుందని, ఈ స్థానాన్ని తెలంగాణ ఇంటి పార్టీకి ఇస్తున్నారన్న ఆందోళన వద్దని కార్యకర్తల కు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూచిం చారు. ఈ ఎన్నికల్లో తాను మునుగోడు నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వార్‌రూంలో స్క్రీనింగ్ కమిటీతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భక్త చరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ బాగా పనిచేస్తోందని, గతంలో టికెట్ల కేటాయింపు విషయంలో ఏ కమిటీ ఇంతలా పని చేయలేదన్నారు. అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలన్నారు.
అలాగే ప్రజల్లో ఉండే నాయకులకే టికెట్లు ఇవ్వాలని నివేదించినట్టు చెప్పారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉందని, నకిరేకల్ సీటు ఇస్తామని ఎక్కడా చెప్పలేదని గురువారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఇన్‌చార్జి కుంతియా చెప్పారని ఆయన గుర్తుచేశారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున సి.లింగయ్య పోటీ చేస్తారన్నారు. సీట్లు ఖాయమై నట్టు అధిష్టానం హామీ ఇచ్చిందా? అని మీడియా ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉండి పనిచేసే నాయకులకు టికెట్లు కేటాయిస్తుంది కాబట్టి తమకు టికెట్లు దక్కుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.
జనగామ టికెట్ నాకే: పొన్నాల
చేర్యాల (సిద్దిపేట): జనగామ టికెట్ తనకే వస్తుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం వెలువడకముందే తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాద న్నారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా చేర్యా లలో విలేకరులతో మాట్లాడారు. జనగామ నియోజ కవర్గ టికెట్ తనకే వస్తుందని, టీజేఎస్‌కు కేటాయిస్తా రంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు పన్నుతున్న కుట్రలని కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment