comittees
-
TS: బీజేపీ ఎలక్షన్ కమిటీల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ప్రకటించింది బీజేపీ. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీల్ని ప్రకటించింది బీజేపీ. ఇందులో భాగంగా.. రాజగోపాల్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది. పబ్లిక్ మీటింగ్ కమిటీ ఇంఛార్జ్‌గా బండి సంజయ్, మ్యానిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్ గా గడ్డం వివేక్ వెంకటస్వామి, ఛార్జ్‌షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌రావు ఎంపిక చేసింది. వీటితో పాటు.. అజిటేషన్ కమిటీ(నిరసనలు, ఆందోళన నిర్వహణల బాధ్యతలు) చైర్మన్ గా విజయశాంతి, ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్‌లకు బాధ్యతలు అప్పజెప్పింది. పొంగులేటి సుధాకర్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రామచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు సైతం కమిటీలలో చోటు కల్పించారు. తెలంగాణను ఆరు జోన్లుగా విభజించుకుని.. ఎన్నికల వ్యూహాలు అమలు చేయాలని కమలం భావిస్తోంది. ఈక్రమంలోనే.. ఇవాళ నేడు సంస్థాగత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సునీల్ బన్సల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొంటారు. వెయ్యి మందికి పైగా ఈ సమావేశాలకు హాజరవుతారని అంచనా.పార్లమెంట్,అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. -
రేవంత్, వీహెచ్, కోమటిరెడ్డి, డీకే అరుణ, జైపాల్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీల్లో కాంగ్రెస్ పార్టీ తన మార్కు రాజకీయాన్నే ప్రదర్శించింది. ఎవరు ఎంతగా పట్టుబట్టినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా, స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నా.. అధిష్టానం తాను అనుకున్న విధంగానే ఎన్నికల ‘సైన్యాన్ని’ఏర్పాటు చేసింది. బుధవారం ప్రకటించిన 10 కమిటీల్లో సామాజిక సమతుల్యతను పాటించడంతోపాటు కీలక నేతలు ఆశించిన పదవులను ఇవ్వకుండానే ప్రక్రియను పూర్తి చేసింది. ముఖ్యంగా ప్రచార కమిటీ విషయంలో కాంగ్రెస్ తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ కమిటీ సారథ్య బాధ్యతలు ఆశించిన మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.కె.అరుణ, యువ నాయకుడు రేవంత్‌రెడ్డి, సీనియర్లు వీహెచ్, జైపాల్‌రెడ్డిలకు షాక్ ఇచ్చింది. ఈ పదవిని అనూహ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించింది. ఈ కమిటీ కోచైర్మన్‌గా మాత్రం డి.కె.అరుణను నియమించింది. కోమటిరెడ్డి, రేవంత్‌లకు ఆ కమిటీలో స్థానం కూడా కల్పించలేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యాధికుడు డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్‌ను ప్రచార కమిటీ కన్వీనర్‌గా నియమించడం విశేషం. ఇక, ఈ కమిటీలో యువనేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి, ఇటీవల అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలతో పాటు ఇద్దరు ఓయూ జేఏసీ నేతలతో కలిపి మొత్తం 17 మందికి అవకాశం కల్పించారు. ప్రచార కమిటీతో పాటు మేనిఫెస్టో కమిటీ బాధ్యతలను కూడా ఇద్దరు దళిత నేతలకు అప్పగించారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ముందు నుంచీ అనుకున్నట్టుగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను నియమించారు. ఈ కమిటీకి కో చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు. ఆయనకు పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా కూడా బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అయితే, ఈ కమిటీల పట్ల పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కమిటీల రూపకల్పనలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కల హవానే నడిచిందని, వారిద్దరి మార్కు కమిటీలుగానే ఇవి కనిపిస్తున్నాయని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు... పార్టీలో మొదటి నుంచీ ప్రచారం జరుగుతున్న విధంగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మల్లు భట్టివిక్రమార్క(ఎస్సీ)కి తోడు ఒక ఓసీ, ఒక బీసీ నేతను కూడా ఆ హోదాలో నియమించారు. పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు ఆశించిన రేవంత్‌రెడ్డి, మొదటి నుంచీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించడంతో ఎస్సీ, బీసీ, ఓసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పించినట్టయింది. అయితే, టీపీసీసీకి రేవంత్, పొన్నం ప్రభాకర్‌లే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉంటారని, భట్టి ప్రచార కమిటీ చైర్మన్ హోదాలోనే పనిచేస్తారని టీపీసీసీ చెబుతున్నా.. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. సభ్యుడిగానే జానారెడ్డి... సీఎల్పీ నాయకుడిగా పనిచేసిన జానారెడ్డికి ఆయన స్థాయికి తగిన కమిటీల్లో అవకాశం కల్పించినప్పటికీ, ఏ ఒక్క కమిటీ సారథ్య బాధ్యతలు ఆయనకు అప్పగించలేదు. పార్టీ కోర్‌కమిటీ, సమన్వయ కమిటీ, టికెట్ల ఖరారులో కీలక పాత్ర పోషించే రాష్ట్ర ఎన్నికల కమిటీల్లో జానారెడ్డిని సభ్యుడిగా నియమించారు. అయితే, ఏదో ఒక కమిటీకి ఆయన్ను చైర్మన్‌గా నియమించాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ ఇద్దరికీ ప్రాధాన్యం... పీసీసీ మాజీ అధ్యక్షుల హోదాలో పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావులకు టీపీసీసీ కమిటీల్లో ప్రాధాన్యత లభించింది. ఈ ఇద్దరినీ పార్టీ కోర్ కమిటీ, సమన్వయ కమిటీ, ఎన్నికల కమిటీల్లో నియమించారు. వీటికి అదనంగా పొన్నాలకు మేనిఫెస్టో కమిటీలో అవకాశం ఇవ్వగా, పార్టీ వ్యూహరచన, ప్రణాళిక రూపకల్పన కమిటీ చైర్మన్ బాధ్యతలను వీహెచ్‌కు అప్పగించారు. ఈ కమిటీలో కేంద్ర మాజీ మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, సీనియర్ నేత జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి హేమాహేమీలను సభ్యులుగా నియమించడం విశేషం. బ్రదర్స్‌కు మూడు పదవులు... రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక పదవులను ఆశించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌పై అధిష్టానం కొంత అభిమానాన్ని చూపించినప్పటికీ, పూర్తిగా సంతృప్తికర పదవులను ఇవ్వలేకపోయిందనే చర్చ జరుగుతోంది. పార్టీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా, మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్‌గా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించిన అధిష్టానం, ఎన్నికల కమిటీలో రాజగోపాల్‌రెడ్డికి అవకాశం కల్పించింది. రేవంత్‌కు నిరాశే..! తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన యువ నేత రేవంత్‌రెడ్డికి ఓ రకంగా కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనకు గతంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఖరారు చేసినప్పటికీ ఆయన వద్దనడంతో పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఎన్నికల కమిటీల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని, ప్రచార కమిటీ బాధ్యతలిస్తారని రేవంత్, ఆయన అనుచరులు ఆశించారు. కానీ, మళ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవినే రేవంత్‌కు అప్పగించింది. ఆయనకు పదవి రాకుండా పార్టీలోని సీనియర్లే అడ్డుకున్నారనే చర్చ జరుగుతోంది. రేవంత్‌కు కీలక బాధ్యతలిస్తే వన్‌మ్యాన్ షో చేస్తారని, ఎంతో మంది సీనియర్లను కాదని, ఇటీవలే పార్టీలోకి వచ్చిన నేతకు కీలక బాధ్యతలిస్తే ఆయనపై పార్టీ ఆధారపడిందనే అభిప్రాయం కలుగుతుందని సీనియర్లు అధిష్టానం వద్ద తమ వాదనలను బలంగా వినిపించడంతోనే రేవంత్‌కు అడ్డుకట్ట పడిందనే చర్చ జరుగుతోంది. గత నెలలో రాహుల్ రాష్ట్ర పర్యటన సందర్భంగా సరూర్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగానికి వచ్చిన అనూహ్య స్పందన కూడా దీనికి ఆజ్యం పోసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, రేవంత్‌తో పాటు పార్టీలో చేరిన సీతక్క, విజయరమణారావు, వేం నరేందర్‌రెడ్డి, బిల్యానాయక్లకు పలు కమిటీల్లో చోటు కల్పించడం గమనార్హం. పండగే పండగ.. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఎన్నికల కమిటీల్లో స్థానం కల్పించిన నేతల జాబితా చాంతాడంత ఉన్నప్పటికీ, ఆయా కమిటీల్లో పేర్లు వచ్చిన నేతలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ సమన్వయ కమిటీలో ఏకంగా 53 మందిని, ఎన్నికల కమిటీలో 41 మందిని నియమించడం, ఎన్నికల కమిటీలో పార్టీ అనుబంధ సంఘాలకు చైర్మన్లుగా ఉన్న 11 మంది నేతలకు ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. అయితే, ఈ అనుబంధ సంఘాల్లో వికలాంగ విభాగం చైర్మన్ పేరు లేదు. ఏఐసీసీ స్థాయిలో వికలాంగ విభాగం అధికారికం కాకపోవడంతోనే కేవలం 11 మంది చైర్మన్లకు అవకాశం ఇచ్చారని అంటున్నారు. మరోవైపు ఎల్డీఎంఆర్సీ, ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ, క్రమశిక్షణా కమిటీల పేరుతో మరో 19 మంది నేతలకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా గాంధీభవన్‌లో అందుబాటులో ఉండే నేతలకు ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీలో అవకాశమిచ్చారు. మహిళలు పది మందే... ఏఐసీసీ ప్రకటించిన 10 కమిటీల్లో కేవలం 10 మంది మహిళా నేతలకే అవకాశమిచ్చారు. డి.కె.అరుణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, విజయశాంతి, రేణుకా చౌదరి, సీతక్క, పద్మావతి, నేరెళ్ల శారద, ఆకుల లలిత, అజ్మతుల్లా హుస్సేనీలకు పలు కమిటీల్లో స్థానం కల్పించారు. వీరిలో కేవలం అరుణకు మాత్రమే ప్రచార కమిటీ కోచైర్మన్ బాధ్యతలిచ్చారు. అయితే, విజయశాంతి పేరు తొలుత ప్రకటించిన కమిటీల్లో లేకపోగా, ఆ తర్వాత విడిగా ఆమెను స్టార్ క్యాంపెయినర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పేరును అటు స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించకపోగా, ఏ కమిటీల్లో కూడా ఆయనకు స్థానం కల్పించలేదు. ఇక, మెదక్ డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డిల పేర్లు కూడా కమిటీల్లో లేవు. సురేశ్‌రెడ్డి పేరు ప్రత్యక్షం ఏఐసీసీ ప్రకటించిన జాబితాలో ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి పేరు ఉండడం చర్చనీయాంశమైంది. పార్టీ సమన్వయ కమిటీ, ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీల్లో సురేశ్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఆ తర్వాత నాలుక్కరుచుకున్న అధిష్టానం ఆయా కమిటీలను మార్పు చేస్తూ సురేశ్‌రెడ్డి పేరు తొలగించి మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సురేశ్‌రెడ్డి పేరు జాబితాలో ఉండడంతో ఈ కమిటీల నియామక ప్రక్రియ 10 రోజుల క్రితమే పూర్తయిందనే చర్చ జరుగుతోంది. 10 నుంచి 15 రోజుల క్రితమే కసరత్తు పూర్తయినా అధిష్టానం ఈ జాబితాలను ప్రకటించకపోవడం వెనుక ఆంతర్యమేమిటనేది కాంగ్రెస్ ముఖ్య నేతలకు కూడా అంతుబట్టడం లేదు. ఐదు జిల్లాలకు అధ్యక్షులేరీ..? ఏఐసీసీ ప్రకటించిన కమిటీల్లో ఐదు ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షులుగా పనిచేస్తున్న నేతల పేర్లు కనిపించలేదు. నల్లగొండ, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ అధ్యక్షులు ఉన్నా వారికి ఏ కమిటీలోనూ అవకాశమివ్వలేదు. కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులకు మాత్రం పలు కమిటీల్లో స్థానం కల్పించారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ పేరు కూడా ఏ కమిటీలోనూ లేకపోవడం గమనార్హం. మొదటి వారంలో టికెట్లు? పార్టీ ఎన్నికల కమిటీని కూడా ప్రకటించడంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా తయారీకి మార్గం సుగమం అయింది. ఈ కమిటీనే పార్టీ అభ్యర్థుల జాబితా కింద అర్హులైన ఆశావహుల పేర్లను సిఫారసు చేస్తుంది. ఈ పేర్లను పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ తమకుండే అభ్యంతరాలపై స్థానిక నాయకత్వంతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల కమిటీ రావడంతో ఆ కమిటీ భేటీ రెండు, మూడు రోజుల్లో జరుగుతుందని టీపీసీసీ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ మొదటివారంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితా వస్తుందనే చర్చ జరుగుతోంది. వీహెచ్ అసంతృప్తి పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా తనను నియమించకపోవడంతో వీహెచ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన జాబితా వచ్చిన తర్వాత తనకు వ్యూహ, ప్రణాళిక కమిటీ చైర్మన్ అవసరం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డీకే అరుణ కూడా మీడియా వద్ద తమ అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి పదవి ఇవ్వడం సబబు కాదని, ఈ విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని పొంగులేటి పేర్కొన్నారు. తమకు పదవులు అవసరం లేదని, పదవులు లేకున్నా పార్టీకోసం పనిచేస్తామని డీకే అరుణ నిర్వేదంగా వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్సీపీ కమిటీల నియామకం
నల్లగొండ టూటౌన్: జిల్లాలోని పలు మండలాలకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులను నియమిస్తూ బుధవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అనుమతితో కమిటీలను నియమించినట్లు తెలిపారు. అదే విధంగా కోదాడ నియోజకవర్గంలో పట్టణ, మండల కమిటీలను నియమించినట్లు తెలిపారు. మండల అధ్యక్షులు పేరు మండలం పుప్పల శ్రీను చింతపల్లి పి.శ్రావణ్‌కుమార్ యాదవ్ చందంపేట యు.తిరుపతిరెడ్డి దేవరకొండ పి.సైదులు వేములపల్లి ఎం.వీర్రెడ్డి మిర్యాలగూడ ఎ.కరుణాకర్‌రెడ్డి దామరచర్ల పిల్లుట్ల బ్రహ్మయ్య మిర్యాలగూడ రూరల్ కొల్లు శ్రీధర్‌రెడ్డి ఆత్మకూర్ డి.రమేష్ సూర్యాపేట టౌన్ ఎం.ఉపేందర్‌రెడ్డి చివ్వెంల టి.జనార్ధనాచారి పెన్‌పహాడ్ మాచర్ల దాశరథి కనగల్ ఆర్.వెంకటేశ్ భువనగిరి తుప్పల్లి కృష్ణారెడ్డి బీబీనగర్ వింజమూరి కిషన్ వలిగొండ ఓరుగంటి కృష్ణ పోచంపల్లి రుద్రపు శంకరయ్య రామన్నపేట ఎ.సత్యనారాయణ చిట్యాల మారెడ్డి జానకిరాంరెడ్డి కట్టంగూరు బాసాని నర్సింహ నార్కట్‌పల్లి పి.పిచ్చయ్య గౌడ్ నకిరేకల్ ఎడ్ల దేవయ్య కేతేపల్లి కె.వెంకట్‌రెడ్డి తిరుమల్‌రెడ్డి ఏసుమల్ల రమేష్ తుంగతుర్తి వేముల గణేష్ అర్వపల్లి బోడ యాకూబ్ శాలిగౌరారం ఎం.రాంరెడ్డి మోత్కూరు కోదాడ పట్టణం కమిటీ కోదాడ పట్టణ అధ్యక్షుడిగా వాకా సుదర్శన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎస్.కే.జబ్బార్, ప్రధాన కార్యదర్శులుగా ఇనుముల నర్సింహారెడ్డి, మామిడి మస్తాన్, ధరావత్ నాగేశ్వర్రావు, కార్యదర్శులుగా మారికంటి నాగేశ్వర్రావు, తిగుళ్ల నాగేశ్వర్రావు, ఆతుకూరి వెంకటేశ్వర్లు, రెడ్డిమళ్ల వెంకట్‌రెడ్డి, సీహెచ్.నర్సయ్య, దండల రామిరెడ్డి, కోటపల్లి వెంకట్‌రెడ్డి, రాము, నంద్యాల కృష్ణారెడ్డి, పింగళి వెంకటేశ్వర్‌రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడిగా ఎస్.కె.తాజుద్దీన్ నియమితులయ్యారు. కోదాడ రూరల్ మండల కమిటీ కోదాడ రూరల్ మండల అధ్యక్షుడిగా కన్నె కొండల్రావు, ఉపాధ్యక్షుడిగా బలవంతం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా వనపర్తి శ్రీను, వెంకటనారాయణ, ఎస్కే. జానీ, శెట్టి చంద్రయ్య, కార్యదర్శులుగా అనంతాచారి, ఇస్తావత్ రవీందర్‌నాయక్, ఎం.సత్యనారాయణ, శ్రీధర్‌రెడ్డి, జంగం రామారావు, చెరుకూరి కోటయ్య, ధరవత్ రామ్నాయక్లు నియమితులయ్యారు. మోతె మండలం మోతె మండల అధ్యక్షుడిగా దాసరి భిక్షం, కార్యదర్శులుగా పగడాల రెడ్డి, ఉపేందర్, బొక్క ఉపేందర్‌రెడ్డి, గుడిపల్లి మట్టయ్య, బక్కపట్ల ఉపేందర్, బొడ్డు కాటమరాజు, మండల యూత్ అధ్యక్షుడిగా బయ్య గంగయ్య, యూత్ కార్యదర్శులుగా అంబాల నరేందర్, పగిళ్ల నరేశ్, మండల రైతు అధ్యక్షుడిగా సూరకంటి నర్సిరెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షేక్ రహీం, మండల గౌరవ అధ్యక్షుడిగా కట్టుకూరి రాంరెడ్డిలు నియమితులయ్యారు. చిలుకూరు మండలం చిలుకూరు మండల అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా వల్లభి సైదులు, మర్రి శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శులుగా గంగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాగిరెడ్డి చినసైదిరెడ్డి, సూరగాని పుల్లయ్య, అలసకాని రాంబాబు, కస్తూరి కొండయ్య, బాలబోయిన సైదులు, నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, షేక్ సులేమాన్ సాహేబ్, ప్రేపల్లి పెద్ద నాగేశ్వర్రావు, బజ్జూరి సత్యనారాయణ, సైదానాయక్, బి.వెంకట్‌రెడ్డి, సీహెచ్.రామిరెడ్డి, దేవరం సైదిరెడ్డి, కొండా భద్రయ్య, మీసాల సురేశ్, సూరగాని యాదగిరిలు నియమితులయ్యారు. మునగాల మండలం మునగాల మండల అధ్యక్షుడిగా షేక్ వాహిద్, ప్రధాన కార్యదర్శులుగా మర్రి సైదిరెడ్డి, సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మయ్యచారి, కార్యదర్శులుగా సతీశ్, బ్రహ్మం, మనోహర్, శంకర్, బోసు, రామానుజం, ఎస్.కె.సైదా, ఎస్.కె.దస్తగిరి, ఎస్.కె.యాకుబ్, ఎస్.కె.నాగూల్, ఎస్.కె. బాలసైదా, ఎస్.కె.నజీర్, వెంకన్న, ఎస్.కె.హుస్సేన్, ఎస్.కె.ఫకీర్, దాసరి సైదులు నియామకం అయ్యారు. నడిగూడెం మండలం నడిగూడెం మండల అధ్యక్షుడిగా రామిని సైదిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా మట్టపల్లి రాంకోటయ్య, కన్నెబోయిన రామారావు, మోతుకూరి పుల్లచారి, కార్యదర్శులుగా నక్కా చంద్రశేఖర్, వట్టికూటి చంద్రయ్య, రామిని లక్ష్మారెడ్డి, చిలకల కమాలాకర్‌రెడ్డి, పల్లె ప్రభాకర్, మట్టపల్లి నర్సయ్య, బెల్లంకొండ శ్రీనివాస్, మాదాసు వెంకట్ రత్నం, దొంతగాని సతీశ్, చందూరి సుబ్బారావు, బాణాల నర్సింహాచారి, భద్రయ్య, మిట్టగణుపుల రోశయ్య, సైదిరెడ్డి, చలమయ్య రంగయ్య, మట్టపల్లి పెద్ద వెంకన్నలు నియమితులయ్యరు. -
'గిరిజనుల హక్కులను టీడీపీ సర్కార్ కాలరాస్తోంది'
గిరిజనుల హక్కులను టీడీపీ సర్కారు కాలరాస్తోందని పాలకొండ ఎమ్మెల్యే బి. కళావతి ఆరోపించారు. హుద్‌హుద్ తుపాను కారణంగా పంటలను నష్టపోయిన గిరిజనులకు ఇంతవరకూ నష్టపరిహారం అందించలేదని టీడీపీ సర్కారుపై కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమిటీలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి ప్రజాప్రతినిధులను పక్కన పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. కమిటీలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి.. ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులను పట్టించుకోకపోవడం.. ప్రజా తీర్పునకు విరుద్ధంగా నడుచుకోవడమే అన్నారు. జనవరి 31, ఫిబ్రవరి 1న తణుకులో జరగనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు దీక్షకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి పిలుపునిచ్చారు.