'తుపాను ప్రభావంతో రాష్ట్రం అతాలకుతలం' | chandra babu naidu wrote a letter to people | Sakshi
Sakshi News home page

'తుపాను ప్రభావంతో రాష్ట్రం అతాలకుతలం'

Published Thu, Oct 16 2014 6:58 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'తుపాను ప్రభావంతో రాష్ట్రం అతాలకుతలం' - Sakshi

'తుపాను ప్రభావంతో రాష్ట్రం అతాలకుతలం'

విశాఖ:హుదూద్ తుపానుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అయ్యిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం నుంచి తేరుకోక ముందే.. పెను తుపానుతో రాష్ట్రం మరింత క్లిష్టపరిస్థితులకు వెళ్లిందని బాబు అన్నారు. గురువారం హుదూద్ తుపాను అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు. ఈ తుపాను ప్రభావంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులవ్వగా,, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. గత విశాఖ చరిత్రలో ఇటువంటి ఘోర విపత్తు సంభవించలేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ పరంగా బాధిత ప్రజలను ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టామని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement