బాధితులను ఆదుకోవడంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రూ. 50 లక్షల విరాళం ఇచ్చిన పవన్ కల్యాణ్ ను బాబు ఈ సందర్భంగా అభినందించారు. గురువారం విశాఖపట్నంలో పవన్ కల్యాణ్తో కలసి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. తుపాన్ బాధితులను ఆదుకోవడం అందరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ఖర్చులు ఎంతైనా పరవాలేదు... ప్రజల బాధలు తీరాలనేదే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. హుదూద్ తుపానుకు ఆర్థిక సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నాని తెలిపారు. బంగాళదుంపల కోసం బెంగాల్ సీఎంతో మూడుసార్లు మాట్లాడినట్లు చంద్రబాబు వివరించారు. నేటి నుంచి తుపాను సహాయ కార్యక్రమాలు అన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత తీరిందన్నారు. విశాఖ ప్రజల్లో ఆత్మస్థైర్యం కలిగించామన్నారు.