తుపాను సాయం కోసం నేడు ఢిల్లీకి జగన్ | Y. S. Jaganmohan Reddy to meet Aruna Jaitley on Hudhud Cyclone | Sakshi
Sakshi News home page

తుపాను సాయం కోసం నేడు ఢిల్లీకి జగన్

Published Sat, Nov 8 2014 2:25 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

తుపాను సాయం కోసం నేడు ఢిల్లీకి జగన్ - Sakshi

తుపాను సాయం కోసం నేడు ఢిల్లీకి జగన్

విశాఖపట్నాన్ని ముంచెత్తిన హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయం విడుదల చేయాలని కోరేందుకుగాను

సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నాన్ని ముంచెత్తిన హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయం విడుదల చేయాలని కోరేందుకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఢిల్లీ వెళుతున్నారు. పార్టీకి చెందిన ఎంపీలతో కలసి ఆయన శనివారం ఢిల్లీ వెళ్లి సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలసి తుపాను నష్టాన్ని వివరించడంతోపాటు తక్షణ సహాయం అందించాలని కోరనున్నారు. 
 
ఈ సందర్భంగా హుద్‌హుద్ తుపాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి తుపాను నష్టాన్ని వివరించి తక్షణ సహాయం కోరాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే శనివారం  ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కుదరకపోవడంతో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కలసి తక్షణ సహాయ ఆవశ్యకతను వివరించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement