
మేకపాటి రాజమోహన రెడ్డి
హుదుహుద్ తుపాను బాధితులకు కేంద్ర సహాయం పెంచాలని వైఎస్ఆర్ సీపి పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన రెడ్డి డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: హుదుహుద్ తుపాను బాధితులకు కేంద్ర సహాయం పెంచాలని వైఎస్ఆర్ సీపి పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఇక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు.
హుదుహుద్ తుపానుపై పార్లమెంటులో చర్చజరపాలని ఆయన కోరారు. తుపాను వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో భారీనష్టం సంభవించినట్లు తెలిపారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అందువల్ల వారికి కేంద్రం చేసే సాయం పెంచాలని మేకపాటి కోరారు.
**