
'కాంగ్రెస్ కావాలనే మాపై బురద జల్లుతోంది'
ఎన్ని ఇబ్బందులు వచ్చినా... హుదూద్ తుపాను బాధితులను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.
హైదరాబాద్: ఎన్ని ఇబ్బందులు వచ్చినా... హుదూద్ తుపాను బాధితులను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తుపాను బాధితుల కోసం వివిధ రూపాల్లో నిధులు సేకరిస్తామని చెప్పారు. తుపాను విధ్వంసంపై తమ ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిందని ఆయన గుర్తు చేశారు.
తమ ప్రభుత్వం తుపాను బాధితులను అదుకోవడం... సహాయక చర్యలు చేపట్టడంలో తమ ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడంపై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే తమపై బురద జల్లుతుందని ఆరోపించారు. తుపాను సహయక చర్యల కోసం మరిన్ని నిధులను కేంద్రం నుంచి కోరతామని యనమల తెలిపారు.