
ఢిల్లీకి వైఎస్ జగన్, సాయంత్రం జైట్లీతో భేటీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ బాధితులు, ప్రభావిత ప్రాంతాలను ఆదుకోవాలని ఆయన జగన్ కేంద్రాన్ని కోరనున్నారు.
తుపాను బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయం విడుదల చేయాలని కోరేందుకుగాను వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో కలసి ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నారు. తుపాను నష్టాన్ని వివరించడంతోపాటు తక్షణ సహాయం అందించాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా కోరనున్నారు. అలాగే తుఫాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తారు.