విజయనగరం కంటోన్మెంట్ : భీకర గాలులతో జిల్లాను కుదిపేసిన హుద్‌హుద్ తుపాను మిగిల్చిన నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం చలించిపోయింది. జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు బుధవారం వచ్చిన కేంద్ర బృందంలోని సభ్యులు పూసపాటిరేగ, భోగాపురంమండలాల్లో పర్యటించి, అక్కడ జరిగిన నష్టాన్ని కళ్లారా చూశారు. కొన్నిచోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో, అక్కడ జరి గిననష్టాలను ఫొటో ఎగ్జిబిషన్‌లో తిల కించారు. కేజీ బేసిన్ ఎస్‌ఈ ఆర్. రమేష్‌కుమార్, ఫైనాన్స్ కమిషన్ డివిజన్‌లోని వ్యయ శాఖ ైడె రెక్టర్ రాజీబ్ కుమార్‌సేన్, ఏహెచ్‌డీ అండ్ ఫైనాన్స్ శాఖకు చెందిన ఉప కార్యదర్శి పీఎస్ చక్ర బర్తి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ కె రామవర్మ జిల్లాలోని తుపాను బీభత్స ప్రాంతాల్లో పర్యటించారు. ముక్కాం, భోగాపురం, కుమిలి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. తుపాను దృశ్యాలను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కొన్ని ప్రాంతాల్లో జరిగిన తీవ్రమైన నష్టాలను చూసి చలించిపోయారు. భోగాపురం, ముక్కాం తదితర ప్రాంతాల్లోని బాధితులనుద్దేశించి వారు మాట్లాడుతూ తుపాను గాలులు తీవ్రంగా వీచాయని విన్నాం! ఆ సమయంలో ఎలా గడిపారు,ఏం తిన్నారని ప్రశ్నించారు. వారు చెప్పిన విషయాలను కలెక్టర్ తర్జుమా చేసి కేంద్ర బృందానికి వివరించారు వీరి భృతికి ఏం చేశారని కలెక్టర్ ఎంఎం నాయక్‌ను అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు బియ్య ం, ఉల్లిపాయలు, బంగళాదుంపలు, పప్పు, పంచదార, కిరోసిన్ ఉచితంగా ఇవ్వడంతో పాటు తక్కువ ధరకు కూరగాయాలు అందజేశామని తెలిపారు. జిల్లాలోని 12 మండలాల్లో పైన పేర్కొన్న సరుకులను పూర్తిగా ఉచితంగా ఇచ్చామని, పాక్షికంగా నష్టం ఏర్పడిన 22 మండలాల్లో బియ్యం, పంచదార ఉచితంగా అందంజేశామన్నారు.
రాజాపులోవ నుంచి కవులవాడ, తూడెం, దిబ్బపాలెం, ముక్కాం, భోగాపురం గ్రామాల్లో ఉదయం తొమ్మిదిన్నర గం టల నుంచి మధ్యాహ్నం వరకూ పర్యటించారు. జిల్లాలో జరిగిన నష్టాలపై శాఖల వారీగా పంపిన అంచనాలను పరిశీలించామని, దీనిపై కేంద్రానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. శాఖల వారీగా పంపిన అంచనాలను సరిపోల్చేందుకే వచ్చామని, ఈ పరిశీలన తరువాత నివేదికలను కేంద్రానికి పంపిస్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. బాధితులతో మాట్లాడినప్పుడు తుపాను సమయంలో ఎటువంటి సహాయం అందిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో పడిపోయిన చెట్లకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇచ్చిందని, వాటిని తొలగించి, వేరే చోట వేయడానికి కూడా ఆ సొమ్ము సరిపోలేదనీ బాధితులు కేంద్రబృందానికి తెలిపారు. రహదారులు బాగు చేయాలని కోరారు. కూలిన టేకు, కొబ్బరి చెట్లు, విద్యుత్‌స్తంభాలను, ముక్కాంలో మత్స్య కారులకు జరిగిన నష్టాన్ని, కుమిలిలో వరి,చెరకు పంటలకు జరిగిన నష్టాలను బృందం సభ్యులు పరిశీలించారు. బృందం వెంట జేసీ బి రామారావు, ఏజేసీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ జి రాజకుమారి, ఆర్‌డీఓ జే వెంకటరావు, సంబంధిత జిల్లా అధికారులు ఉన్నారు.
అయ్యో... ఎంత నష్టం !
Published Thu, Nov 27 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement
Advertisement