ఒక్కరోజు వ్యాపారం @ : రూ.7 కోట్లు | one-day Business @: Rs 7 Crores | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు వ్యాపారం @ : రూ.7 కోట్లు

Published Mon, Jan 5 2015 1:25 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM

ఒక్కరోజు వ్యాపారం @ : రూ.7 కోట్లు - Sakshi

ఒక్కరోజు వ్యాపారం @ : రూ.7 కోట్లు

 తెలుగు ప్రజల పెద్దపండగ సంక్రాంతి సమీపిస్తుండడంతో విజయనగరం పట్టణంలో పండగ కళ ఉట్టిపడుతోంది. ఆదివారం చాలామందికి సెలవుదినం కావడంతో జిల్లాలోని పలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అధిక సంఖ్యలో జిల్లా కేంద్రానికి వచ్చి తమకు కావాల్సిన వస్తు సామగ్రిని కొనుగోలు చేశారు. ఈ ఒక్క రోజే సుమారు రూ.7 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు వ్యాపార వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
 
 విజయనగరం మున్సిపాలిటీ : వాస్తవానికి గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుఫాన్‌తో జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు  పెద్ద మొత్తంలో నష్టపోయినప్పటికీ ఎవరి తాహతుకు తగ్గట్టు వారు పండగను చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా వారం రోజులుగా అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు వస్తున్న వారితో పట్టణం కిటకిటలాడుతోంది. వాస్తవానికైతే సంక్రాంతికి  నెల రోజుల ముందుగానే జిల్లా కేంద్రంలోని మార్కెట్ సందడిగా కనిపిస్తుంది. క్రైస్తవలు ఎంతో ఘనంగా జరుపుకునే    క్రిస్టమస్ పండగ నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. అదే తరహాలో ఈ ఏడాది కూడా మార్కెట్‌లో పండగ శోభ కనిపిస్తోంది. పట్టణ వాసులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలతో పట్టణంలోని రహదారులు రద్దీగా మారా యి. ప్రధానంగా మూడులాంతర్లు, కోట జంక్షన్, మెయిన్‌రోడ్, గంటస్తంభం జంక్షన్, కన్యకాపరమేశ్వరి  ఆలయ కూడలి, కంటోన్మెంట్‌కు వెళ్లే గూడ్స్‌షెడ్ రోడ్‌లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గ్రామాల్లోని పలు కుటుంబాల వారు ఉదయాన్నే బయలుదేరి  పట్టణానికి వచ్చి రోజంతా మార్కెట్ చేసుకుని రాత్రి చివరి బస్సుకు తిరిగి గ్రామాలకు వెళ్తున్నారు.
 
 సందడిగా వస్త్ర విక్రయాలు  
 సంక్రాంతి పండగ వచ్చిందంటే వస్త్ర విక్రయాలదే హవా. అన్ని వర్గాల ప్రజలు ఈ పండగకు నూతన వస్త్రాలు ధరించడం ఆనవాయితీ. అంతేకాకుండా చనిపోయిన పూర్వీకులకు నూతన వస్త్రాలు పెట్టి మొక్కు బడులు చెల్లించుకుంటారు. దీంతో గూడ్స్‌షెడ్ ప్రాంతంలో గల బాలాజీ టెక్స్‌టెల్ హోల్‌సేల్ మార్కెట్‌తో పాటు మెయిన్‌రోడ్, ఉల్లివీధి, డాబాతోట, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలు వారాంతమైన శని, ఆదివారాల్లో కొనుగోలుదారులతో కళకళలాడాయి. సుమారు 170 దుకాణాలున్న బాలాజీ టెక్స్‌టైల్ హోల్‌సేల్ మార్కెట్‌లో ప్రధానంగా పిల్లల రెడీమేడ్ దుస్తులు, మహిళల చీరల అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి.ఈ మార్కెట్‌లో కేవలం జిల్లా వాసులే కాకుండా ఉత్తరాంధ్ర  జిల్లాలకు చెందిన వారు, సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా  ప్రాంతాలకు చెందిన రిటైల్ వ్యాపారులు కొనుగోళ్లు చేస్తుంటారు. అయితే పండగ కావడంతో రెండో రోజులుగా ఈ  మార్కెట్‌కు సాధారణవినియోగదారులు తాకిడి పెరిగింది. హోల్‌సేల్ వ్యాపారంతో బిజీగా ఉన్న దుకాణ యాజమానులు సాధాణ వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని షాపు బయట కూడా అమ్మకాలు చేపట్టారు. దీంతో ఈ  ఒక్క రోజే సుమారు రూ.5 కోట్ల మేర వస్త్ర వ్యాపారం జరిగి ఉంటుందని అంచనా.
 
 అదే తరహాలో కిరాణా సామగ్రి విక్రయాలు
 సంక్రాంతి పండగలో వస్త్రాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో..అదే తరహాలో పిండివంటకాలకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తారు. కొత్త అల్లుళ్లకు, మనుమలు,మనుమరాండ్రకు ఇష్టమైన పిండివంటకాలు, మాంసాహార భోజనం పెట్టి వారిని సంతోషపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలోనే ప్రథానమైన ప్రిన్స్ ఆఫ్ వేల్ (పీడబ్ల్యూ) మార్కెట్‌లో వినియోగదారుల హడావుడి అధికమైంది. జిల్లా కేంద్రంతో పాటు 34 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలకు చెందిన చిరు వ్యాపారులు , జిల్లా నలుమూలలనుంచి వచ్చే వినియోగదారులు ఇక్కడి మార్కెట్‌లోనే తమకు కావాల్సిన నిత్యావసరాలు కొనుగోలు చేస్తుం టారు. ఆదివారం  ఒక్క రోజు సుమారు రూ.రెండు కోట్ల మేర వ్యాపారం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement