సహృదయంతో స్పందించండి | ysrcp and sakshi media calls for help of cyclone victims | Sakshi
Sakshi News home page

సహృదయంతో స్పందించండి

Published Sun, Nov 2 2014 1:43 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సహృదయులంతా విరాళాలు పంపి సాటి వారికి అండగా నిలవాలని వైఎస్సార్ ఫౌండేషన్ - సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి.

తుపాను బాధితులకు ఆపన్నహస్తం అందించండి
దాతలకు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ పిలుపు
 
 సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు  సహృదయులంతా విరాళాలు పంపి సాటి వారికి అండగా నిలవాలని వైఎస్సార్ ఫౌండేషన్ - సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి.  ఈ విరాళాలకు ఆదాయ పన్ను చట్టంలోని 80(జీ) సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సహాయం చేయదలచుకున్న వారు కింద తెలిపిన బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు(అకౌంట్ ట్రాన్స్‌ఫర్) పంపొచ్చు. ఇదే ఖాతాలో జమ అయ్యేలా డీడీ, చెక్కులనూ పంపొచ్చు. డీడీలు, చెక్కులను జిల్లాల్లో స్థానికంగా ఉండే ‘సాక్షి’ కార్యాలయాల్లోనూ నేరుగా అందించవచ్చు. బ్యాంకు, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా విరాళమిచ్చిన దాతలు ఈ-మెయిల్ (ysrfoundation2005@gmail.com) ద్వారా తమ పేరు, చిరునామా తెలపాలి. వారికి రసీదు, దాంతోపాటు 80జీ కింద పన్ను మినహాయించుకోవడానికి అవసరమైన డొనేషన్ సర్టిఫికెట్ పంపిస్తారు. రూ.5,000, అంతకుమించి విరాళమిచ్చే వారి పేర్లను ‘సాక్షి’ పత్రికలో ప్రచురిస్తాం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement