‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు | YSRCP MLA RK Roja Fire on TDP GOvt | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు

Published Fri, Mar 24 2017 2:55 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు - Sakshi

‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు ప్రజలకు తెలుస్తున్నాయనే భయంతో ‘సాక్షి’ గొంతును నొక్కడానికి శాసనసభను వాడుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం చూస్తోందని నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. టీడీపీ అసెంబ్లీని ఎన్టీఆర్‌ భవన్‌లా మార్చి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తోందన్నారు. ఆమె గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ... అగ్రిగోల్డ్‌ అంశాన్ని పక్కదారి పట్టించి ‘సాక్షి’పై నిందలు వేస్తూ కక్ష సాధించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

ఎప్పుడో జరిగిన మహిళా పార్లమెంట్‌ సమావేశాల వివాదాన్ని ఇప్పుడు చర్చకు తీసుకువచ్చి గౌరవ స్పీకర్‌ని ‘సాక్షి’ అవమానించినట్లుగా చిత్రీకరిస్తున్నారని తప్పుబట్టారు. స్పీకర్‌ మాటలను ఒక్క ‘సాక్షి’ మాత్రమే కాకుండా అన్ని జాతీయ మీడియా సంస్థలు ఈ అంశాన్ని ప్రచురించి, ప్రసారం చేసాయని, అయినా కేవలం ఒక్క సాక్షినే లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారంటే నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయనే భయమే దీనికి కారణమని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement