
'రూ.10 వేల కోట్ల సాయం అందించాలి'
హుదూద్ తుపాను కారణంగా భారీగా నష్టపోయిన విశాఖ నగరానికి రూ.10 వేల కోట్ల సాయం అందించాలని ఎంపీ సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు.
విశాఖ: హుదూద్ తుపాను కారణంగా భారీగా నష్టపోయిన విశాఖ నగరానికి రూ.10 వేల కోట్ల సాయం అందించాలని ఎంపీ సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు. తాను వ్యక్తిగతంగా రూ.కోటి రూపాయలు సాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఎంపీ నిధుల నుంచి మరో రూ. కోటి మంజూరు చేస్తానన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సుబ్బిరామి రెడ్డి.. తక్షణమే కేంద్రం రూ. 10 వేల కోట్లను విశాఖకు మంజూరు చేయాలన్నారు. ఇదిలా ఉండగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున రాహుల్ సాయం చేయనున్నట్లు స్పష్టం చేశారు.