నగరంలోని అధికశాతం ప్రజలు ఇప్పటికీ అంధకారంలోనే మగ్గుతున్నారు.
విశాఖ:నగరంలోని అధికశాతం ప్రజలు ఇప్పటికీ అంధకారంలోనే మగ్గుతున్నారు. తొమ్మిది రోజులవుతున్నా..నగరంలో పూర్తిగా చీకట్లు పూర్తిగా తొలగలేదు. యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్న అధికారుల మాటలు ఇప్పటికే అమలు కాలేదు. ఒకప్రక్క పనులు చేపడుతున్నా సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే వున్నాయి. ప్రస్తుతం విశాఖలో 35 శాతానికే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రోజులో కొన్ని గంటలపాటే తాత్కాలిక లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
పూర్తిస్థాయి విద్యుత్ కు 10 రోజులు పట్టే అవకాశ ఉంది. ఇదిలా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండు వారాలు పడుతుందని విద్యుత్ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు.