గండేడ్: జిల్లాలో రబీ సీజన్‌లో అత్యధికంగా సాగయ్యే పంట వరి. వికారాబాద్ డివిజన్‌లో అత్యధికంగా పరిగి ప్రాంతంలోనే వరి సాగవుతోంది. గండేడ్ మండలంలో వెయ్యి ఎకరాల్లో సాగవుతోంది. అదేవిధంగా జిల్లాలో 8,100 హెక్టార్లలో వేరుశనగ పంట సాగవుతుండగా.. ఇందులో సగం మండల పరిధిలో సాగవుతోంది. కానీ ఈసారి సీజన్ ప్రారంభమై ఇరవై రోజులు గడి చినా ఇప్పటికీ చినుకు జాడ లేకపోవడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. ఇటీవల హుధూద్ తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని భావించిన రైతులకు చివరకి నిరాశే మిగిలింది. వర్షాల జాడలేకపోవడంతో డివిజన్ పరిధిలో అంతటా పొలాలన్నీ దుక్కులకే పరిమితమయ్యాయి.
పాతాళగంగను తోడేదెలా..
రబీలో ప్రధానంగా సాగయ్యే వరిపంటకూ కష్టకాలం వచ్చింది. ప్రధాన ప్రాజెక్టులేవీ లేకపోవడంతో వరిసాగు భూగర్భజలాలపైనే ఆధారపడి ఉంది. ఈ క్రమంలో డివిజన్ పరిధిలోని రైతులంతా బోరుమోటర్లపైనే ఆధారపడి వరిసాగు చేస్తున్నారు. రబీలో సాధారణ విస్తీర్ణం 15,550 హెక్టార్లు. అధికంగా పరిగి, చేవెళ్ల, తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో సాగవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వరిసాగకు కీలకమైన పాతాళగంగమ్మను పైకి తీసుకురావడం రైతులకు కష్టంగా మారింది. పొలాలకు కనీసం రెండు గంటలు సైతం కరెంటు అందకపోవడంతో బోరుమోటర్లు నడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో వరి సాగు ముందుకు సాగనిపరిస్థితి నెలకొంది.
రబీలోనూ ఖరీఫ్ కష్టాలే..
Published Mon, Oct 20 2014 12:40 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement