జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిషింగ్ హార్బర్, జాలరిపేటలోని హుదూద్ తుపాను బాధితులను పరామర్శించారు. రాజమండ్రి నుంచి విమానంలో ఈరోజు ఆయన ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా ఫిషింగ్ హార్బర్, జాలరిపేట వెళ్లి బాధితులను కలుసుకున్నారు. బాధితుల సమస్యలు విని, వారిని పరామర్శించారు.