విద్యుత్ ను పొదుపుగా వాడండి: పల్లె
శ్రీకాకుళం: తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో విద్యుత్ ను పొదుపుగా వాడాలని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ లు విజ్ఞప్తి చేశారు.
సర్వే నిర్వహించి అర్హులైన తుఫాన్ బాధితులందరికి త్వరలోనే పరిహారం అందిస్తామని మంత్రులు తెలిపారు. తుఫాన్, నాగావళి వరద సహాయ చర్యలపై మంత్రులు పల్లె, కామినేనిలు సమీక్ష నిర్వహించారు.