
విశాఖలో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫిషింగ్ హార్బర్, జాలరిపేటలోని హుదూద్ తుపాను బాధితులను పరామర్శించారు. రాజమండ్రి నుంచి విమానంలో ఆయన ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా ఫిషింగ్ హార్బర్, జాలరిపేట వెళ్లి బాధితులను కలుసుకున్నారు. బాధితుల సమస్యలు విని, వారిని పరామర్శించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ '' నేను వస్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. నేను రాకపోతే మీరు బాధపడతారు. అందుకే వచ్చాను'' అని అన్నారు. తుపాను బాధితులకు 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించినట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.
పవన్ కల్యాణ్ రేపు ఉదయం విజయనగరంలో పర్యటిస్తారు. ఆ తరువాత శ్రీకాకుళం వెళ్లి అక్కడ బాధితులను పరామర్శిస్తారు.
**