సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ ఖండించింది. గోబెల్ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా? అన్ని ప్రశ్నించింది. బొత్స సత్యనారాయణ నామినేషన్ సందర్భంగా స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే వైవీ సుబ్బారెడ్డి లోపలికి వెళ్లలేదని స్పష్టం చేసింది.
కాగా, వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ వేదికగా..‘నామినేషన్ వేసేటప్పుడు నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురికి మాత్రమే ప్రవేశం. స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సుబ్బారెడ్డి లోపలికి వెళ్లలేదు. నిజాలు ఇలా ఉంటే.. దానికి వక్రీకరణలు జోడించి ఎల్లో మీడియా అబద్ధాలు ప్రసారం చేసింది. గోబెల్స్ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా?’ అని ప్రశ్నించింది.
నామినేషన్ వేసేటప్పుడు నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురికి మాత్రమే ప్రవేశం.
స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సుబ్బారెడ్డిగారు లోపలికి వెళ్లలేదు.
నిజాలు ఇలా ఉంటే.. దానికి వక్రీకరణలు జోడించి ఎల్లో మీడియా అబద్ధాలు ప్రసారం చేసింది. గోబెల్స్ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా? pic.twitter.com/m8TrwbOfh3— YSR Congress Party (@YSRCParty) August 12, 2024
Comments
Please login to add a commentAdd a comment