victims names
-
సర్వే.. నామ్ కే వాస్తే..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పట్టణం, రూరల్ మండలాల్లో చేపట్టిన ముంపు బాధితుల సర్వే నామ్‌కే వాస్తేగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే కోసం వచ్చిన సిబ్బంది కేవలం పేర్లు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇంట్లోకి నీరు ఎంత వరకు వచ్చిందనే వివరాలు మాత్రమే తీసుకుంటున్నారని చెప్తున్నారు. భారీ వరదలతో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయని.. వందల సంఖ్యలో ఇళ్ల గోడలు కూలి, కిటికీలు, తలుపులు ధ్వంసమై తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇళ్లలోని సామగ్రి అంతా తడిసి, కొట్టుకుపోయి నష్టపోయామని గుర్తు చేస్తున్నారు. సర్వే సిబ్బంది ఇవేవీ నమోదు చేయడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల సాయం కోసం మాత్ర మే ఈ సర్వే చేస్తే.. తాము కోల్పోయిన ఇళ్లు, నష్టపోయిన సామగ్రికి పరిహారం అందనట్లేనా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని కోసం మళ్లీ సర్వే ఏదైనా చేస్తారా, సాయం అందుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.పేర్లు నమోదు చేయడం లేదంటూ..మున్నేరు వరదతో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో 70 కాలనీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 15,777 ఇళ్లు వరద తాకిడికి గురైనట్టు అంచనా. ఈ ముంపును తేల్చేందుకు 172 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం నాటికి కొలిక్కి వ చ్చిందని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ సర్వే మొదలుపెట్టిన తొలి రోజున చాలామంది ఇళ్లలో లేకపోవ డంతో వందలాది మంది పేర్లు నమోదు కానట్టు తెలుస్తోంది. తర్వాత కూడా దాతలు ఇచ్చే వస్తువులు, భోజనం అందుకోవడానికి వెళ్లినవారు, కుటుంబం మొత్తం పునరావాస కేంద్రాల్లోనే ఉన్న వారు చాలా మంది తమ పేరు ముంపు బాధితుల జాబితాలో నమోదుకాలేదని వాపోతున్నారు. నమోదవకుంటే ప్రభుత్వమిచ్చే రూ.10వేలు కూడా అందవేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏ అధికారి కూడా.. రాలేదు..వరదలు వస్తున్నాయని సమాచా రం ఇవ్వలేదు. తెలిసినవారు ఫోన్ చేస్తే నిద్రలో లేచి కట్టుబట్టలతో బయటికి పరుగెత్తాం. వరదలు తగ్గి ఐదు రోజులైనా మా ప్రాంతానికి ఏ అధికారి కూడా రాలేదు. మా దగ్గర సర్వే జరగకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందుతుందో, లేదో తెలియడం లేదు.– రేష్మ, పద్మావతినగర్, ఖమ్మంసర్వే లేదు.. సాయం లేదు..రెండు రోజుల నుంచి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికా రులు సర్వే చేశారు. మా ప్రాంతానికి మాత్రం రాలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే ‘వస్తారు.. మీ ఇంటి దగ్గరే ఉండు’ అని చెప్పారు. సర్వేలో నమోదైతేనే సాయం అందుతుందని కొందరు అంటున్నారు. మరి మా వివరాలు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు సాయం చేస్తారో తెలియడం లేదు. – పాటి ప్రదీప్‌కుమార్, వెంకటేశ్వరనగర్, ఖమ్మం -
ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదు: మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఒడిశాలో త్రీవ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో దాదాపు 240 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక, ఏపీలోకి శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి(60) కూడా ఈ ప్రమాదంలో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కాగా, మంత్రి బొత్స ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఒడిషా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన వ్యక్తి మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తిగా గుర్తించాం. ఏపీలో పెన్షన్ తీసుకుని వెళ్తుండగా గురుమూర్తి మృతిచెందాడు. బాలాసోర్‌లో గురుమూర్తి నివాసం ఉంటున్నారు. గురుమూర్తి కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, బాధితులకు కూడా పరిహారం అందిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణీకులను 695 మందిని గుర్తించాం. 553 మంది సురక్షితంగా ఉన్నారు. కోరమండల్ రైలులో 480 మంది, యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది ప్రయాణించారు. 22 మంది గాయపడ్డారు. 92 మంది రైలు ప్రయాణం చేయలేదు. ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదు. గాయపడిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. విశాఖ ఆసుపత్రిలో ఐదుగురికి చికిత్స అందిస్తున్నాం. స్వల్ప గాయాలైన 11 మందికి చికిత్స అందించి పంపించాము అని తెలిపారు. ఇది కూడా చదవండి: రైలు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్.. పరిహారం వివరాలు ఇవే.. -
అసైన్డ్ ల్యాండ్ స్కాం: భయపెట్టి పొలం లాక్కున్నారు..
సాక్షి, గుంటూరు: టీడీపీ హయాంలో జరిగిన అమరావతి భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమరావతిలో జరిగిన అసైన్డ్ భూముల స్కామ్ తాజాగా సీఐడీ దర్యాప్తులో బట్టబయలవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణంలో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతు ప్రకాశం మీడియాతో మాట్లాడుతూ ‘‘నాకు కృష్ణాయపాలెంలో ఎకరా 20 సెంట్ల అసైన్డ్ భూమి ఉంది. గత 40 ఏళ్ల నుంచి భూమిని సాగు చేస్తున్నా. రాజధాని ప్రకటించగానే దళితులు సాగు చేస్తున్న అసైన్డ్ భూమిని.. రాజధాని కోసం ప్రభుత్వం తీసుకుంటుందని ప్రచారం చేశారు. అప్పటి మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎంపీ జయదేవ్ ఈ ప్రచారం చేయించారు. భయపెట్టి, మానసికంగా హింసించి తక్కువ రేటుకు పొలం లాక్కున్నారని’’ ఆయన వాపోయారు. పొలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నారని.. తమ చేతే భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇప్పించారని.. ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన భూమి రిటర్న్ ప్లాట్లు ఇస్తారని చెప్పారని.. ప్లాట్లు ఇచ్చే సమయంలో కొనుగోలుదారులు తమ పేరుపై రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించారన్నారు. అసైన్డ్ భూమి విషయంలో తమకు తీవ్రమైన అన్యాయం చేశారని, మమ్మల్ని మోసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని రైతు ప్రకాశం డిమాండ్ చేశారు. చదవండి: అక్రమాల పుట్ట ‘అమరావతి’ చంద్రబాబుకు శిక్ష తప్పదు.. -
బాధిత కుటుంబంపై కేసు పెట్టాలి
లక్నో/హాథ్రస్: హత్యాచార నిందితులకు మద్దతుగా హాథ్రస్లో ఆదివారం బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ్వీర్ సింగ్ పహిల్వాన్ నివాసంలో ఒక సమావేశం జరిగింది. నిందితులకు మద్ధతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారని రాజ్వీర్ సింగ్ కుమారుడు మన్వీర్ సింగ్ తెలిపారు. అగ్రకులాల వారే కాకుండా, సమాజం లోని అన్ని వర్గాల వారు ఈ సమావేశానికి వచ్చారన్నారు. బాధిత కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేయాలని ఆ సమావేశంలో డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పలుమార్లు తమ స్టేట్మెంట్ను మార్చారని ఆరోపించారు. ఈ సమావేశం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. ‘సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం. వారి దర్యాప్తుపై మాకు విశ్వాసముంది’ అని మన్వీర్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఇది. ఎలాంటి విచారణకైనా నిందితులు సిద్ధంగా ఉన్నారు. వారు తప్పు చేసి ఉంటే ఎప్పుడో పారిపోయేవారు. బాధిత కుటుంబమే ఎప్పటికప్పుడు మాట మారుస్తోంది. నార్కో టెస్ట్కో లేక సీబీఐ దర్యాప్తుకో వారు సిద్ధంగా లేరు’ అన్నారు. కొనసాగుతున్న సిట్ దర్యాప్తు హాథ్రస్ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిఫారసు చేసిన మర్నాడు కూడా.. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన దర్యాప్తు కొనసాగించింది. ఆదివారం సీనియర్ ఐపీఎస్ అధికారి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో సిట్ బాధితురాలి కుటుంబసభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అలాగే, ఈ కేసు విషయంలో సమాచారం ఇవ్వాలనుకునే వారు తమ వద్దకు రావాలని గ్రామస్తులకు సూచించింది. -
అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించకండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపులు, అత్యాచార బాధితులతో పాటుగా వారి తల్లిదండ్రులు, కుటుంబీకుల పేర్ల ను, ఇతర వివరాలను విద్యాసంస్థలు, పత్రికలు, టీవీల ద్వారా బహిర్గతం కాకుండా ప్రభుత్వపరంగా చర్యలు తీ సుకోవాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ విషయం లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు అమలయ్యే లా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆ దేశించింది. అత్యాచార ఆరోపణలపై క్రిమినల్ కేసులతోపాటు శాఖాపరమైన దర్యాప్తు జరపవచ్చునని, ఈ రెండూ వేర్వేరని తేల్చి చెప్పింది. హైదరాబాద్ నగరంలో ఆటమిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రిన్సిపాల్‌గా చేసిన కేదార్నాథ్ మహాపాత్ర 2017 అక్టోబర్ 28న 9వ తరగతి చదివే విద్యార్థిని తన గదికి రప్పించుకుని ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే ఫిర్యాదుపై రాచకొండ పోలీసులు 2017 నవంబర్ 24న మహాపాత్రను అరెస్టుచేసి కోర్టు ఆదేశాల తో రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై విడుదలైన మహా పాత్ర హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తనపై పోలీ సు కేసు ఉన్నందున శాఖాపరంగా దర్యాప్తు చేయకుండా ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ హైకోర్టు వెలువరించిన తీర్పులో అత్యాచార, లైంగిక వేధిం పుల బాధితుల పేర్లను వెల్లడించరాదని సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు అమలయ్యేలా చేయాలని ఆదేశిం చింది. ఈ తరహా కేసులో నమోదు చేసే ఎఫ్ఐఆర్, రిమాం డ్ రిపోర్ట్, చార్జిషీట్లలో పేర్లను పోలీసులు వెల్లడించకుండా చేయాలని, వీటిని కోర్టులకు సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. పోలీసులు నమోదు చేసే క్రిమినల్ కేసుల కు, శాఖాపరంగా జరిగే దర్యాప్తూ వేరువేరని స్పష్టం చేసిం ది. క్రిమినల్ కేసుల్లో శిక్ష పడితే అది సమాజానికి, శాఖాపరమైన దర్యాప్తులో తేలితే అది సంబంధిత యాజమాన్యం –సంస్థకు చెందినది అవుతుందని వివరించింది. తన ముం దున్న కేసులో పిల్లలకు బోధనతోపాటు భద్రత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత విద్యాసంస్థపై ఉంటుందన్నారు. -
చెర్లోపాళెం దుర్ఘటన మృతుల వివరాలు
-
చెర్లోపాళెం దుర్ఘటన మృతుల వివరాలు
కందుకూరు: ప్రకాశం జిల్లా కందుకూరుకు సమీపంలోని చెర్లోపాళెం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో 15 మంది పేర్లు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 15 మంది మృతిచెందినట్లు తెలిసింది. వీరిలో మహిళలు, చిన్నారుల సంఖ్యే ఎక్కువ. ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. గాయపడ్డ మరో 25 మంది స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయినవారి పేర్లు.. 1. సమాధి నాగమ్మ(45) 2. మోటుపల్లి పద్మ(35) 3. సన్నబోయిన రాజమ్మ(40) 4. నక్కల సుభాషిణి(25) 5. కొల్లి సుశీల(40) 6. సన్నబోయిన చందు(12) 7. శ్రీలేఖ(11) 8. ఆదినారాయణ(9) 9. సమాధి రంగయ్య(50) 10. హజరత్తయ్య(40) 11. వెంకటేశ్వర్లు(45) 12. తోలేటి చిరంజీవి (40) 13. తులగాల సుబ్బయ్య(70) 14. రాయిన సుబ్బయ్య(70) 15. తోడేటి ప్రసాద్(30)