CM YS Jagan Review Meeting On Municipal Urban Development Department - Sakshi
Sakshi News home page

గుంటూరు, ఎన్టీఆర్ జిల్లావాసులకు నెరవేరనున్న సొంతింటి కల..

Published Thu, May 11 2023 2:16 PM | Last Updated on Thu, May 11 2023 5:12 PM

CM YS Jagan Review Meeting On Municipal Urban Development Department - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో పురపాలక పట్టణావృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్నారు. 

21 లేఅవుట్లలో పేదలకు ఇళ్లపట్టాలు..
– ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. 
– 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 
– మొత్తం 21 లే అవుట్లలో పేదలకు ఇళ్లపట్టాలు.


– గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 10 లే అవుట్లలో, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు. 
– ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
– జంగిల్‌ క్లియరెన్స్, ల్యాండ్‌ లెవలింగ్‌ పనులు ముగిశాయని వెల్లడించిన అధికారులు.
– దాదాపు 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్‌ రోడ్లు వేసే పనులుకూడా చేపడుతున్నామని తెలిపారు.

– ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు అదనపు భవనం నిర్మాణం కూడా పూర్తవుతోందని వెల్లడించిన అధికారులు.
– 76,300 చదరపు అడుగులు విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన కూడా జరుగుతోందని వెల్లడించిన అధికారులు.
– సీఐటీఐఐఎస్‌ కార్యక్రమం కింద చేపడుతున్న పనులనూ వివరించిన అధికారులు.
– దాదాపు 12 అర్భన్‌ ప్రాంతాల్లో ఈ పనులు చేపడుతున్నామని వెల్లడించారు.

టిడ్కో ఇళ్లపైనా సీఎం జగన్‌ సమీక్ష..
– టిడ్కో ఇళ్లలో ఫేజ్‌ –1 కు సంబంధించి 1,50,000 ఇళ్లలో ఇప్పటికే 1.39 లక్షలు పూర్తి.
– 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లు అప్పగించామని వెల్లడించిన అధికారులు.
– జూన్‌ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపిన అధికారులు.
– రెండో విడతకు సంబంధించిన 1,12,092 ఇళ్లను సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో లబ్ధిదారులకు అందిస్తామని అధికారులు వెల్లడించారు. 
– గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం.
– జూన్‌ మొదటి వారంలో సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్న అధికారులు.

– ఈ సందర్బంగా విశాఖపట్నంలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ సూచించారు.
– దీనికి అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
– వీటి ద్వారా బీచ్‌లో వ్యర్థాలను తొలగించాలన్నారు. 
– పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మరింత మెరుగుపడుతుందన్న ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు.

– విజయవాడలో కృష్ణానది వరద ముప్పు నుంచి తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ ద్వారా ఏర్పడ్డ రివర్‌ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. 
– రివర్‌ బెడ్‌పై వాకింగ్‌ ట్రాక్‌ సహా చేపడుతున్న వివిధ బ్యూటిఫికేషన్‌ పనులను ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారు. 
– విజయవాడ నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా దీన్ని తీర్చిదిద్దాలన్న సీఎం జగన్‌ ఆదేశించారు.
 
ఈ సమీక్షా సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్,  ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి బసంత్‌ కుమార్, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ సుబ్బారావు, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: వైఎస్సార్‌సీపీలోకి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే.. కుమారుడితో కలిసి చేరిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement