
హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌పై సమీక్ష జరిపారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment