వరంగల్‌ అభివృద్ధిపై సమీక్ష.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు | Cm Revanth Reddy Review On The Development Of Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌ అభివృద్ధిపై సమీక్ష.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

Published Sat, Jun 29 2024 6:52 PM | Last Updated on Sat, Jun 29 2024 7:52 PM

Cm Revanth Reddy Review On The Development Of Warangal

సాక్షి, వరంగల్‌: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన వరంగల్‌ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం.. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్  రింగ్ రోడ్డు ఉండాలన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్‌ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్న సీఎం. స్మార్ట్ సిటీ మిషన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.

వరంగల్ నగర అభివృద్ధిపై ఇకనుంచి ప్రతీ 20 రోజులకోసారి ఇంచార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని ఆదేశించిన సీఎం.. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వరంగల్‌లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్న సీఎం.. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement