Disha SoS App
-
‘దిశ’తో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ
సాక్షి, అమరావతి: దిశ అమలుతో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకోనుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 70,00,520 మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. ఇందులో 3,78,571 ఎస్ఓఎస్ రిక్వెస్టులు వచ్చాయని, ఇందులో చర్యలు తీసుకోదగ్గవి 4,639 ఉన్నాయని తెలి పారు. బుధవారం ఆయన స్పందన సమీక్షలో మాట్లాడుతూ.. ‘దిశ’ మీ మానస పుత్రిక అని, ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు, ఎస్పీలు ఓన్ చేసుకోవాలని సూచించారు. ప్రతి మహిళ తన ఫోన్లో దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం లక్ష్యం కావాలని, దీన్ని సవాలుగా తీసుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగానికి సూచించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. కలెక్టర్లు, ఎస్పీల ప్రతిష్ట పెరుగుతోంది ► దిశ యాప్ ద్వారా మూడు నెలల్లో దాదాపు 900 సక్సెస్ స్టోరీలు ఉన్నాయి. సక్సెస్ స్టోరీ అంటే.. ఏదైనా జరగకముందే దాన్ని నివారించి, మహిళలకు అండగా నిలవడం. ఫోన్‌ను షేక్ చేస్తే చాలు.. సగటున 6 నిమిషాల్లోగా మహిళకు భద్రత కల్పించేలా యాప్‌ను తీర్చిదిద్దాం. ► గత ప్రభుత్వం హయాంలో చార్జిషీటు వేయడానికి సగటున 300 రోజులు పడితే, ఇప్పుడు 42 రోజుల్లోగా వేస్తున్నాం. దేశంలో మహిళల మీద నేరాల్లో 91 శాతం కేసుల్లో కేవలం 2 నెలల వ్యవధిలోనే చార్జిషీటు దాఖలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రికార్డుల ప్రకారం జాతీయ సగటు 35 శాతంగా ఉంది. తిరుగులేని రీతిలో పోలీసు విభాగం పని చేస్తోంది. è కలెక్టర్లు, ఎస్పీల ప్రతిష్ట గణనీయంగా పెరుగుతుంది. దేశం మొత్తం మీ గురించి మాట్లాడుకుంటుంది. ప్రతి సచివాలయంలో మహిళా పోలీసు ఉన్నారు. వలంటీర్లు ఉన్నారు. వీరి సేవలను వినియోగించుకోండి. మహిళల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లో తప్పకుండా దిశ యాప్ ఉండేలా చర్యలు తీసుకోండి. దీన్నొక సవాల్‌గా తీసుకోండి. గ్రామ, వార్డు సచివాలయాల్లో తని ఖీలకు వెళ్తున్నప్పుడు దిశ యాప్, దిశయాప్ డౌన్‌లోడ్‌ను ఒక అంశంగా తీసుకోండి. ఎఫ్ఐఆర్ నమోదులో వెనకడుగు వద్దు ► అధిక సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయని పోలీసులు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. దిశ యాప్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా మనం ప్రోత్సహిస్తున్నాం. ► ఏపీలో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఎవరైనా వ్యాఖ్యలు చేసినా వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ► కేరళలో ఏడాదికి 7 లక్షలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు అవుతున్నాయి. మహిళలు చైతన్యంగా ఉన్నప్పుడు, పోలీసులు స్నేహ పూర్వకంగా ఉన్నప్పుడే.. ఫిర్యాదుదారులు ముందుకు రాగలుగుతారు. అలాంటి సందర్భాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి. ► 70 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారంటే.. దాని అర్థం ఏంటంటే.. ఏ ఘటన జరిగినా ఫిర్యాదు చేయడానికి, కేసులు నమోదు చేయడానికి ఆ మహిళలకు అండగా ఉంటున్నట్టే లెక్క. ప్రతి మహిళ తన ఫోన్లో దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం లక్ష్యం కావాలి. -
రమ్య సోదరికి ఉద్యోగం.. ఇంటి స్థలం, ఐదెకరాల పంట భూమి
-
మహిళల భద్రతపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు
-
మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి సుచరిత
-
మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి సుచరిత
సాక్షి, గుంటూరు: మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. దిశా చట్టం రాష్ట్రపతి అనుమతి పొందే సమయానికల్లా చట్టాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరోవైపు కొంతమంది దిశ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారని, అలా దిశ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. అనేక మంది మహిళలు ఇప్పటికే దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్నారని గుర్తు చేశారు. గతం ప్రభుత్వంలో మహిళా తహశీల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేసిన పట్టించుకోలేదని, మరి ఇప్పడు అదే టీడీపీ శ్రేణులు దిశ చట్టాన్ని అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టం ద్వారా ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేస్తున్నారని, ఇప్పటికీ ఆ విధంగా 1500 కేసుల్లో 7రోజుల్లో ఛార్జిషీటు వేశామన్నారు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వ్యాఖ్యానించారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దని, ఏదైనా ఘటన జరగగానే దాన్ని మానవతా దృక్పథంతో చూడకుండా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. చదవండి: Child Marriages: ప్రతి 100 మంది ఆడపిల్లల్లో 30 మందికి ఈ వయస్సులోపే పెళ్లిళ్లు -
Disha App: ప్రాణాలు కాపాడిన ‘దిశ’
-
సీఎం వైస్ జగన్ దిశా యాప్ చిత్రాలతో సైకత శిల్పం
-
మహిళలకు బ్రహ్మాస్త్రం దిశా యాప్ : భూమన కరుణాకర్ రెడ్డి
-
మహిళల భద్రతకే సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత :సుచరిత
-
వజ్రాయుధంలా మహిళలకు తోడుంటున్న దిశ యాప్
-
ఏపీలో 14 ‘దిశ కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన ‘దిశ’ కేంద్రం శుభవార్త తెలిపింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మహిళల కోసం ఏపీలో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలిపారు. చిత్తూరు జిల్లాకు మంజూరు చేసిన రెండు కేంద్రాల్లో ఒకటి ఇంకా పని ప్రారంభించలేదని మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. హింసకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు పోలీసు రక్షణ, వైద్య, న్యాయ సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్ సేవలతోపాటు వారికి ఆశ్రయం కల్పించేందుకు దిశ కేంద్రాలను తీర్చిదిద్దినట్లు మంత్రి వివరించారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ కేంద్రాల్లో రేయింబవళ్లు సేవలు అందుతున్నాయని చెప్పారు. మహిళల సాధికారతను సాధించేలా వారికి రక్షణ, భద్రత కల్పించేందుకు మిషన్ శక్తి కార్యక్రమం కింద ఆయా జిల్లాల్లో దిశ కేంద్రాల స్థాపన జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు. -
దిశయాప్ పై పోలీసుల అవగాహన సదస్సు
-
మృగాళ్లా వ్యవహరించే వాళ్లను క్షమించకూడదు : తమ్మినేని
-
ప్రతి జిల్లాలో ‘దిశ’ ప్రత్యేక కోర్టులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో దిశ ప్రత్యేక కోర్డులను ప్రభుత్వం ఏర్పాటుచేయనుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో విశాఖ రేంజ్ పరిధిలోని మూడు జిల్లాలకు సంబంధించిన సచివాలయ మహిళా పోలీసులు, మహిళా మిత్రలకు దిశ యాప్‌పై శనివారం అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిశ యాప్, సైబర్‌మిత్ర వాట్సప్, ఏపీ పోలీస్ సేవా యాప్ అందించే సేవలను నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా, టెక్నికల్ డీఐజీ పాలరాజు, దిశ డీఐజీ రాజకుమారిలు వివరించారు. అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసులకు అదనపు బలంగా 15వేల మంది సచివాలయ మహిళా పోలీసులు మహిళల భద్రతకు సేవలందిస్తున్నారన్నారు. పోలీస్స్టేషన్ల్లో ఉండే మహిళా పోలీసులకు ఏవైతే అధికారాలు ఉంటాయో అవన్నీ సచివాలయ మహిళా పోలీసులకు ఉంటాయన్నారు. అవగాహన కార్యక్రమాలు ప్రతి డివిజన్, మండల, గ్రామాల స్థాయిలో దీనిని నిర్వహిస్తామన్నారు. ‘స్పందన’తో సామాన్య ప్రజలకు న్యాయం గతంలో పోలీస్స్టేషన్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్ల అక్కడకు వెళ్లేందుకు ప్రజలు వెనుకడుగు వేసేవారని డీజీపీ అన్నారు. కానీ, వీటన్నింటికీ చెక్ చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్పందన’తో సామాన్య ప్రజలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదైన 59 రోజుల్లో ఆ కేసు చార్జిషీట్ ఫైల్ చేయకపోతే.. తక్షణమే ఎస్పీకి మెసేజ్ వెళ్తుందన్నారు. కాగా, స్పందన కార్యక్రమం తీసుకొచ్చిన 20 నెలల కాలంలో 31,100 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు గౌతమ్ సవాంగ్ చెప్పారు. మరోవైపు.. ఏఓబీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని డీజీపీ తెలిపారు. ఏజెన్సీలో గంజాయి సాగుకు మావోయిస్టులు సహకరిస్తున్నారని.. అలాగే, లేటరైట్ సమస్య ఇప్పటిది కాదని, దీనిని కావాలని కొందరు రాజకీయం చేస్తున్నారని డీజీపీ చెప్పారు. -
మహిళ సాధికారత దిశగా ఏపీ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది : ఏపీ డీజీపీ
-
మన మహిళలు దేశానికే ఆదర్శం
అక్క చెల్లెమ్మల భద్రత కోసమే దిశ యాప్‌ను రూపొందించాం. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మ మొబైల్ ఫోన్లో దిశ యాప్ ఉండాలి. కనీసం కోటి మందికిపైగా సెల్ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేయించాలి. ఈ యాప్ ఉంటే అన్నయ్య తోడున్నట్టే. ఆపదలో చిక్కుకుంటే ఈ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు. అందుకు అవకాశం లేకుంటే సెల్ ఫోన్‌ను అటూ ఇటూ గట్టిగా ఊపితే చాలు. నిమిషాల్లో పోలీసులు మీరున్న ప్రదేశానికి వచ్చి మీకు రక్షణ కల్పిస్తారు. అందుకోసం ఎన్నో ఫీచర్లు ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చాం. – సీఎం వైఎస్ జగన్ ప్రతి ఇంటికీ వెళ్లి యాప్ డౌన్లోడ్ చేయిస్తున్నాం మా సచివాలయంలో 32 మంది వలంటీర్లకు గాను 26 మంది మహిళా వలంటీర్లు ఉన్నారు. వాళ్లందరికీ దిశ యాప్ గురించి వివరించి డౌన్లోడ్ చేయించాను. వీరందరూ ఇంటింటికీ వెళ్లి యాప్ ఉపయోగం గురించి వివరిస్తూ డౌన్లోడ్ చేయిస్తున్నారు. రెండు రోజుల్లో 1,515 మంది సెల్ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. – కనకదుర్గ, మహిళా పోలీస్, గొల్లపూడి సచివాలయం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళ దేశానికే ఆదర్శం కావాలన్నదే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆ దిశగా ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని, ప్రతి అడుగు కూడా అక్కచెల్లెమ్మలకు మేలు చేసేదిగానే ఉంటుందన్నారు. మహిళల భద్రత కోసం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కనీసం ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున.. మొత్తంగా 18 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 900 మొబైల్ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించామని, ఒక వారంలో మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దిశ కేసులకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించామని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దిశా చట్టాన్ని మెరుగు పరుస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. వీటన్నింటికీ తోడు ఆపద వేళల్లో అక్కచెల్లెమ్మలకు ఓ అన్నయ్యగా అండగా నిలిచేలా ‘దిశ’ యాప్‌ను రూపొందించామని, ఈ యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని గ్రామ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ‘దిశ యాప్ అవగాహన సదస్సు’లో ఆయన పాల్గొన్నారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, ఆపద ఎదురైతే ఆ యాప్‌ను ఉపయోంచి తక్షణం పోలీసు రక్షణ పొందే విధానాన్ని ఆయన స్వయంగా మహిళలకు వివరించారు. మహిళలు, యువతులతో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేయించారు. యాప్ పనితీరులో భాగంగా దిశ పోలీసులు నిర్వహించిన డెమోనూ మహిళలకు చూపించి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పైగా పోలీస్ స్టేషన్లలో అధికారులు, ఇతర సిబ్బంది వర్చువల్‌గా వీక్షించిన ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సదస్సులో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు వనిత, సుచరిత, పుష్పశ్రీవాణి, సదస్సులో యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని..మొబైల్‌ను చూపుతున్న మహిళలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలి – అక్కచెల్లెమ్మల సెల్ఫోన్లో ఈ దిశ యాప్ ఉండాలి. అందుకోసం మహిళా పోలీసులు, వలంటీర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించాలి. ఈ యాప్ ఉంటే జరిగే మంచి గురించి తెలపాలి. దిశ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్వయంగా వివరించాలి. ఈ ప్రచారాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్‌లా చేపట్టాలి. – దిశ యాప్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఉందన్నది మహిళా పోలీసులు, వలంటీర్లకు బాగా తెలుసు. మొన్న ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన సంఘటన నా మనసును చాలా కలచివేసింది. ఓ అమ్మాయి ఏ సమయంలోనైనా బయటకు వెళ్లినప్పుడు, జన సందోహం లేనప్పుడు అనుకోకుండా ఏమైనా జరిగితే వాళ్ల పరిస్థితి ఏమిటన్నదానికి ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన సంఘటనే నిదర్శనం. – ఏడాది క్రితం తెలంగాణలో దిశ అనే అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం తెలిసిందే. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం దాన్ని ఎలా ఆపగలం అనే ఆలోచన నుంచే ఈ దిశ యాప్‌ను అభివృద్ధి చేశాం. ఈ యాప్‌ను ఎంత ఎక్కువ మంది అక్కచెల్లెమ్మలతో డౌన్లోడ్ చేయించగలిగితే అంత ఎక్కువగా వారికి సహాయం చేయగలుగుతాం. – ఆపదలో వారికి తోడుగా నిలబడే పరిస్థితి వస్తుంది. అందుకే మహిళా పోలీసులు, వలంటీర్లు, ఇతర సచివాలయ సిబ్బంది దిశ యాప్ రాయబారులుగా వ్యవహరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి ఈ యాప్ ఆవశ్యకతను వివరించి డౌన్లోడ్ చేయించాలి. బటన్ నొక్కితే చాలు వెంటనే పోలీసు రక్షణ – ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే ఓ అన్నయ్య మీకు తోడున్నట్టుగా భావించవచ్చు. అనుకోని విధంగా ఏదైనా ఆపద కలిగినప్పుడు ఈ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు నిమిషాల్లో మీ దగ్గరకు వస్తారు. – ముందు మీకు ఫోన్ చేస్తారు. మీరు ఫోన్ ఎత్తి పొరపాటున బటన్ నొక్కుకుపోయింది అని అంటే సరే అని రారు. ఇబ్బందుల్లో ఉన్నాము అని మీరు చెబితే నిమిషాల్లోనే మీరున్న ప్రదేశానికి వచ్చి మీకు రక్షణ కల్పిస్తారు. – ఒకే వేళ మీరు ఫోన్ ఎత్తకపోయినా సరే.. మీరు ఆపదలో ఉన్నారని అర్థం చేసుకుని వెంటనే వచ్చి మీకు రక్షణగా నిలుస్తారు. ఈ యాప్ ద్వారా మీ లొకేషన్ అంటే మీరున్న ప్రదేశం ఎక్కడ ఉందన్న సమాచారం నేరుగా కంట్రోల్ రూమ్‌కు తెలుస్తుంది. తద్వారా పోలీసులు నేరుగా మీరున్న ప్రదేశానికి వచ్చి రక్షణ కల్పించేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆపదలో ఫోన్ ఊపితే చాలు.. – అక్కచెల్లెమ్మలకు ఆపద కలిగినప్పుడు ఫోన్లో ఉన్న బటన్ నొక్కేంత సమయం లేనప్పుడు.. ఆ ఫోన్‌ను అటూ ఇటూ గట్టిగా ఊపితే చాలు మీరు ఆపదలో ఉన్నారని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తుంది. అక్కడ నుంచి మీకు ఫోన్ చేస్తారు. మీరు ఫోన్‌కు స్పందించలేదంటే మీరు ఆపదలో ఉన్నారని గుర్తించి వెంటనే మీ వద్దకు చేరుకుని రక్షణ కల్పిస్తారు. – ఈ విధంగా మనం ఎక్కడికి పోయినా, ఏ పరిస్ధితుల్లో ఉన్నా ఫోన్ మన దగ్గర ఉంటే చాలు మనకు ఎలాంటి ముప్పు కలగకుండా ఓ అన్నయ్యలా ఈ యాప్ అండగా నిలుస్తుంది. ఈ యాప్‌ను ఎంత ఎక్కువగా డౌన్ లోడ్ చేయిస్తే అంత మంచి జరుగుతుంది. – అది ఎలా వాడాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేర్పించాలి. ఇదొక పెద్ద కార్యక్రమం. దీన్ని వలంటీర్లు, మహిళా పోలీసులు, మహిళా మిత్రలు అందరూ బాధ్యతగా తీసుకుని ప్రతి ఇంటికి వెళ్లి డౌన్ లోడ్ చేయించాలి. – గొల్లపూడి గ్రామంలో దాదాపు 2,800 ఇళ్లకు గాను ఇప్పటికే 15 వందల ఇళ్లలో డౌన్ లోడ్ చేశారు. మిగిలిన 1,300 ఇళ్లలో త్వరలోనే డౌన్లోడ్ చేయిస్తారనే నమ్మకం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అందరి ఇళ్లకు వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయించాలి. ట్రాక్ మై ట్రావెల్ ఫీచర్ – ఈ యాప్‌లో ఉన్న మరో ముఖ్య అంశం కూడా ఉంది. మనం ఎక్కడకైనా ఆటోలోనో, ట్యాక్సీలోనో తెలియని వాళ్ల వాహనంలో ప్రయాణం చేయాల్సి రావచ్చు. అప్పుడు వాళ్ల మీద మనకు ఏమైనా కొద్దిగా అనుమానం వచ్చినా ఈ యాప్ మనకు రక్షణగా నిలుస్తుంది. – ఈ యాప్‌లో మనం వెళ్లాల్సిన లొకేషన్‌ను ఈ యాప్‌లో టైప్ చేసి ట్రాక్ మై ట్రావెల్ అనే బటన్ నొక్కితే చాలు. మీరు వెళ్లాల్సిన రూట్‌ను చూపిస్తుంది. మీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీస్ కంట్రోల్ రూం ట్రాకింగ్‌లో పెడుతుంది. ఆ వాహనం సరైన మార్గంలో వెళ్లకపోతే పోలీసులు వెంటనే వస్తారు. మీకు రక్షణ కల్పిస్తారు. – మహిళలకు పోలీసులు ఏదైనా సందేశం ఇవ్వడానికి ‘పుష్’ బటన్ ఆప్షన్ ఈ యాప్‌లో ఉంది. త్వరలోనే మరిన్ని ఆప్షన్లను కూడా పొందుపరచనున్నాం. సున్నితమైన, ప్రమాదకర ప్రదేశాలు, చైన్ స్నాచింగ్ వంటి వాటికి ఆస్కారం ఉన్న ప్రాంతాల గురించి మహిళలను అప్రమత్తం చేసేలా అదనపు ఫీచర్లు ఏర్పాటు చేయబోతున్నాం. కోటి మందికిపైగా డౌన్లోడ్ చేసుకునేలా చేయాలి – రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి అక్క, చెల్లెమ్మ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ కావాలి. ఇప్పటికే 17 లక్షల మందికిపైగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. – కనీసం కోటి మందికిపైగా డౌన్లోడ్ చేసుకునేలా చేయాలి. మన ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇప్పటికే నాలుగు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. దిశ పోలీస్ స్టేషన్లు – మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు కనీసం ఒక పోలీస్ స్టేషన్ ఉండేలా చేయడంతో పాటు వాటిలో పూర్తిగా మహిళా అధికారులు, సిబ్బందినే నియమించాం. – మహిళలకు సైబర్ క్రైం, ఇతరత్రా సమస్యలు ఎదురైతే ఆ పోలీస్ స్టేషన్‌కు వెళితే చాలు. అక్కడ అంతా మహిళలే ఉంటారు కాబట్టి మనస్ఫూర్తిగా వారితో మాట్లాడొచ్చు. వారు మీ సమస్యలు పూర్తిగా వింటారు. ఫిర్యాదు తీసుకుంటారు. మీ సమస్యను సత్వరం పరిష్కరిస్తారు. – దాదాపు 900 మొబైల్ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలను కూడా ఈ మధ్యే ప్రారంభించాం. పెట్రోలింగ్‌ను ఇంకా పెంచేందుకు ఈ వారంలోనే మరిన్ని వాహనాలు వాహనాలను తీసుకురానున్నాం. ప్రత్యేక కోర్టులు – దిశా చట్టాన్ని కూడా మెరుగ్గా చేసేందుకు, మరింత ఉపయోగకరంగా ఉండేటట్టు చేసి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అనుమతులు మంజూరు కేంద్రం చేతిలో ఉంది కాబట్టి ఇంకా పూర్తి చట్టం తీసుకురాలేకపోయాం. ఈలోగా మనం చేయాల్సిన వాటికి సంబంధించి ప్రతి అడుగు ముందుకు వేస్తున్నాం. – దిశ కోసం ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడుతున్నాం. ప్రత్యేకంగా దిశ కేసులనే చూడటానికి ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. అట్టడుగు వర్గాల్లో విశ్వాసం – ఈ రాష్ట్ర హోం మంత్రి ఓ మహిళ. నా చెల్లి, దళితురాలు. అట్టడుగు వర్గాల్లో విశ్వాసం నింపేందుకు ఈ విషయం చెబుతున్నాం. అట్టడుగు వర్గాలకు కూడా పూర్తి న్యాయం జరుగుతుంది. పోలీసుల దగ్గరికి వెళ్లడానికి భయపడాల్సిన పని లేదు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు అనే మెసేజ్ పోవడానికి ఉపయోగపడుతుంది. – ఈ యాప్ అభివృద్ధి చేసే విషయంలో సుచరితమ్మ కూడా కీలక పాత్ర పోషించారు. ‘దిశ’కు సంబందించిన ఇద్దరు మహిళా అధికారులను నియమించాం. ఐపీఎస్ అధికారి దీపికా పాటిల్, ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా ప్రత్యేకంగా దిశ కార్యక్రమాల మీదే పని చేస్తున్నారు. – ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య(నాని), ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, డీజీపీ గౌతం సవాంగ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. మూడు నిమిషాల్లోనే పోలీసు రక్షణ సదస్సుకు హాజరైన ఓ వలంటీర్ తన సెల్‌ఫోన్ నుంచి దిశ యాప్‌లోని ఎస్ఓస్ బటన్‌ను నొక్కింది. వెంటనే పోలీస్ కంట్రోల్ రూం నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మీ రక్షణకు వస్తున్నాం.. ఏమీ కంగారు పడొద్దు.. అని వారు ధైర్యం చెప్పారు. అనంతరం కంట్రోల్ రూం సిబ్బంది ఆమె ఉన్న ప్రదేశానికి సమీపంలోని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఆ యువతి రక్షణకు వెళ్లాలని చెప్పారు. ఆ వెంటనే భవానీపురం పోలీసులు ఆ వలంటీర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. కాసేపటికే తమ వాహనంలో ఆమె వద్దకు వచ్చారు. వలంటీర్ దిశ యాప్‌ను ఉపయోగించినప్పటి నుంచి కేవలం మూడు నిముషాల్లోనే ఆమె వద్దకు పోలీసులు రావడం విశేషం. ఆమె ఉన్న ప్రదేశం గురించి నావిగేషన్ ద్వారా తెలుసుకోవడం, తక్షణ ఆధారాల సేకరణ కోసం పోలీసుల యూనిఫాంకు కెమెరాలు అమర్చిన విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందరికీ వివరించారు. ఈ మొత్తం డెమోను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరిస్తూ స్రీన్లపై చూపించడంతో యాప్ ఎంత సమర్థంగా పని చేస్తుందన్నది అందరికీ స్పష్టంగా తెలిసింది. -
మహిళలు సంతోషంగా ఉండాలంటే మీ ప్రభుత్వం ఎప్పుడు ఉండాలి
-
మీలాంటి ముఖ్యమంత్రి ఉండడం వల్ల ప్రతి మహిళ ధైరంగా ఉండగలుగుతున్నారు
-
ఇంద్రునికి వజ్రాయుధం లాగా మహిళలకు దిశా యాప్ ఇచ్చారు
-
నేడు గొల్లపూడిలో దిశ యాప్ అవగాహన సదస్సు
సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడ): విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో మంగళవారం నిర్వహించనున్న ‘దిశ’ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరిస్తారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో స్క్రీన్లపై ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ అవగాహన సదస్సులో వర్చువల్ విధానంలో పాల్గొంటారు. (ఫైల్‌ఫోటో) ఈ సదస్సు కోసం గొల్లపూడి పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం 10గంటలకు బయలుదేరి 10.30 గంటలకు గొల్లపూడిలోని పంచాయతీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మొక్కలు నాటుతారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదుగురు మహిళలతో వారి మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తారు. అన్ని జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలతో నిర్వహించే దిశ యాప్ డౌన్లోడ్ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్ విధానంలో వీక్షిస్తారు. ఈ సందర్భంగా దిశ యాప్ ఆవశ్యతను వారికి ముఖ్యమంత్రి స్వయంగా చెబుతారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వీడియో స్క్రీన్లపై ప్రదర్శించి వివరిస్తారు. మహిళా భద్రతకు సీఎం పెద్దపీట ఈ కార్యక్రమం కోసం గొల్లపూడి పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను సోమవారం దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ యాప్ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా పాల్గొననుండటం మహిళా భద్రతకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని చెప్పారు. ఇప్పటికే 20 లక్షలమంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం దిశ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు, దిశ యాప్ అమలు విభాగం ప్రత్యేక అధికారి దీపిక పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చదవండి: కోవిడ్‌పై పోరులో మంచిపేరు వచ్చిందనే.. తప్పుడు రాతలు -
ఇప్పటివరకు 17 లక్షల దిశ యాప్ డౌన్ లోడ్స్ : కృత్తికా శుక్లా
-
దిశా యాప్ ను ప్రతి ఒక్క మహిళ డౌన్ లోడ్ చేసుకోవాలి :పుష్పశ్రీవాణి
-
మహిళా భద్రతపై ‘దిశా’ నిర్దేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా భద్రత కోసం విప్లవాత్మక రీతిలో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ అంశంపై పూర్తి అవగాహన కల్పించడం ద్వారా తాము సురక్షితమైన భద్రత వ్యవస్థలో ఉన్నామని మహిళలకు భరోసా కల్పించేందుకు ఉపక్రమించింది. అందుకోసం ‘దిశ’ మొబైల్ యాప్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కార్యాచరణను విస్తృతం చేసింది. విపత్కర పరిస్థితులు ఎదురైతే తక్షణం పోలీసు సహాయం పొందేందుకుగాను విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. దిశ యాప్‌పై ప్రజల్లో స్వయంగా అవగాహన కల్పించాలని ఆయన నిర్ణయించారు. కృష్ణాజిల్లా గొల్లపూడిలో మంగళవారం నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి కూడా ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. యాప్‌ను డౌన్లోడ్ చేయించనున్న సీఎం గొల్లపూడిలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ‘దిశ’ యాప్ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. గొల్లపూడిలోని ఒకటో నంబర్ రోడ్డులో ఉన్న పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందుకోసం పెద్ద తెర, ప్రొజెక్టర్ మొదలైనవి ఏర్పాటు చేస్తున్నారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని, ఆపదలో ఉపయోగించాల్సిన విధానాన్ని విద్యార్థినులు, యువతులు, మహిళలకు ముఖ్యమంత్రి వివరిస్తారు. కొందరు మహిళల మొబైల్ ఫోన్లలో ఆయనే స్వయంగా ఆ యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తారు. దశ ‘దిశ’లా మహిళా భద్రత మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరిస్తారు. దిశ చట్టం తేవడంతోపాటు దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. మహిళలపై వేధింపులకు పాల్పడితే దోషులను సత్వరం శిక్షించేందుకు క్రిమినల్ జస్టిస్ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఇక ఆపదలో చిక్కుకుంటే తక్షణం పోలీసు సహాయం పొందేందుకు దిశ యాప్‌ను రూపొందించింది. ఇవన్నీ వివరించడం ద్వారా మహిళలు తాము రాష్ట్రంలో సురక్షితమైన వ్యవస్థలో ఉన్నామనే భరోసాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 లక్షలమందికిపైగా దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. గొల్లపూడిలో నిర్వహించే అవగాహన సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్ద స్క్రీన్ మీద యాప్ పనితీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా వివరిస్తారని సీఎం కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం ‘సాక్షి’కి తెలిపారు. దేశానికే దిశా నిర్దేశం మహిళా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థాగత సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. దిశ చట్టం తేవడంతోపాటు ఆ చట్టం సమర్థ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన మౌలిక వ్యవస్థను ఏర్పాటుచేసి ఓ రక్షా కవచాన్ని రూపొందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా దిశా యాప్ అవగాహన సదస్సులో పాల్గొననుండటం పోలీసు వ్యవస్థకు, ప్రజలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. – గౌతం సవాంగ్, డీజీపీ -
ఈ నెల 29న గొల్లపూడికి వెళ్లనున్న సీఎం జగన్
-
రేపు గొల్లపూడికి వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): రేపు (మంగళవారం) గొల్లపూడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. మహిళ భద్రత, రక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ యాప్’ వినియోగంపై అవగాహన, చైతన్యం కల్పించేందుకు ఉదయం 10.30 గంటలకు విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో కార్యక్రమం జరగనుంది. దీనికి సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రతి మహిళా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీఎం జగన్ గొల్లపూడి వెళ్లనున్నారు. ఈ క్రమంలో గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న సభా స్థలాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం పరిశీలిస్తున్నారు. సభ ఏర్పాట్లపై ఆయన డీఐజీ పాల్‌రాజ్ (టెక్నికల్ సర్వీస్), దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డీసీపీ–2 విక్రాంత్ పాటిల్, విజయవాడ వెస్ట్ ఏసీపీ డాక్టర్ కె. హనుమంతరావులతో చర్చించారు. మహిళలు, విద్యార్థినులు, యువతులు దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకునేలా ఇంటింటికీ ప్రచారం చేసి వారిలో అవగాహన పెంచాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని, ఈ క్రమంలోనే ఆయన స్వయంగా యాప్ డౌన్ లోడ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని రఘురాం వివరించారు. ఎంపీడీఓ సునీత, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస నాయక్, భవానీపురం సీఐ జె. మురళీకృష్ణ, గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. చదవండి: కడదాం.. 'దిశ' కంకణం ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి -
ఏపీ : దిశా యాప్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు
-
మహిళలకు రక్షణ కవచం ‘దిశ’ యాప్
తిరుపతి (యూనివర్సిటీ క్యాంపస్): విద్యార్థినులు, యువతులు, మహిళలు ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఎలా బయట పడాలి. ఎవరికి ఫోన్ చేయాలి. ఫోన్ చేసినప్పుడు అవతలి వారు లిఫ్ట్ చేయకపోతే పరిస్థితి ఏమిటి. ఆపదలో ఉన్న మహిళ కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే ఏం చేయాలి. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘దిశ’ యాప్. దీనిని ఎక్కడి నుంచి.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆపత్కాలంలో ఎలా వినియోగించాలనే విషయాలపై శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ ఆడిటోరియం వేదికగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామ మహిళా పోలీసులు, సంఘ మిత్రలు, మహిళా సంఘ లీడర్లకు శనివారం అవగాహన కల్పించారు. ఆపద వేళ యువతులు, మహిళలు, విద్యార్థినులను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం మేరకు రూపొందించిన ఈ యాప్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు యువతులు, మహిళలకు సదా ఓ అన్నయ్య తోడు ఉన్నట్టేననే విషయాన్ని వివరించారు. డౌన్ లోడ్.. ఉపయోగించడం ఇలా ► ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ► యాప్‌లోఎస్‌వోఎస్ బటన్ ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు యాప్‌ను ఓపెన్ చేసి, అందులో ఉన్న ఎస్‌వోఎస్ బటన్ నొక్కాలి. ఆ వెంటనే వారి ఫోన్ నంబర్, చిరునామా, వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. ► ఆ వెంటనే కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమవుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు క్షణాల్లోనే సమాచారం పంపిస్తారు. ► విపత్కర పరిస్థితుల్లో యాప్‌ను ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్ వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. ఎక్కువ మందికి డౌన్లోడ్ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. దిశను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకొని వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మహిళా రక్షణ గురించి సీఎం వైఎస్ జగనన్నకు బాగా తెలుసని, దేశంలోనే మొదటిసారిగా దిశ చట్టానికి ఆయన రూపకల్పన చేశారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో సంఘ మిత్రలు యాప్‌ను ఎక్కువ మందితో డౌన్లోడ్ చేయించి ఎక్కువ మందికి అవగాహన కల్పించాలన్నారు. అలా ఎక్కువ మందికి డౌన్లోడ్ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం అందించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జమున, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య మమత, రెక్టార్ ఆచార్య శారద, అడిషనల్ ఎస్పీ సుప్రజ యాప్ ఆవశ్యకతను వివరించారు. సదస్సుకు హాజరైన చంద్రగిరి నియోజకవర్గంలోని మహిళా సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య లీడర్లు, గ్రామ మహిళా పోలీసులంతా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. -
కడదాం.. 'దిశ' కంకణం
► విద్యార్థినులు, యువతులు, మహిళలు తమ ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌లో రిజిస్ట్రేషన్ కోసం తమ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ వెంటనే ఆ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది. దాన్ని కూడా యాప్‌లో నమోదు చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ► దిశ యాప్‌లో అత్యవసర సహాయం (ఎస్‌వోఎస్) బటన్ ఉంటుంది. యువతులు, మహిళలు ఎక్కడైనా ఆపదలో చిక్కుకున్నారని భావిస్తే వెంటనే యాప్‌ను ఓపెన్ చేసి, అందులో ఉన్న ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కాలి. ఆ వెంటనే వారి ఫోన్ నంబర్, చిరునామా, వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. ► ఆ వెంటనే కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమవుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తారు. ► ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కడం ద్వారా వారి వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియో కూడా రికార్డ్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పంపుతుంది. ► విపత్కర పరిస్థితుల్లో యాప్‌ను ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్ వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పోలీసులు అక్కడికి చేరుకుంటారు. పోలీస్ వాహనాల్లో అమర్చిన ‘మొబైల్ డేటా టెర్మినల్’ ఇందుకు సహాయ పడుతుంది. సాక్షి, అమరావతి: వేళ కాని వేళనో.. ఊరు కాని ఊరులోనో.. ఎక్కడైనా కావచ్చు అనుకోకుండా బయటికి వెళ్లినప్పుడో, ఇంటి వద్దనే ఒంటరిగా ఉన్నప్పుడో ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే దాని నుంచి ఎలా బయట పడాలి? తొలుత ఎవరికి ఫోన్ చేయాలి? అలా ఫోన్ చేసినప్పుడు వారు లిఫ్ట్ చేయకపోతే పరిస్థితి ఏమిటి? తిరిగి మరొకరికి ఫోన్ చేసే అవకాశం ఉండకపోతే? కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘దిశ’ యాప్. సెల్ ఫోన్లోని ఈ యాప్‌లో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే సరి.. వెంటనే సమీపంలోని పోలీసులు అక్కడికి వచ్చి రక్షణ కల్పిస్తారు. వర్తమాన కాలంలో ఆపద వేళ యువతులు, మహిళలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన సమాచార సాంకేతిక అద్భుతం ‘దిశ’ మొబైల్ యాప్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం మేరకు పోలీసు శాఖ ఈ యాప్‌ను రూపొందించింది. దీనిని సీఎం వైఎస్ జగన్ గత ఏడాది ఫిబ్రవరి 8న ఆవిష్కరించారు. ఆ యాప్ తమ మొబైల్ ఫోన్లో ఉంటే చాలు యువతులు, మహిళలకు సదా ఓ అన్నయ్య తోడు ఉన్నట్టే. తాము ఆపదలో ఉన్నామని సందేశం ఇస్తే చాలు.. క్షణాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని రక్షిస్తారు. అందుకే అద్భుత ఆవిష్కరణగా ‘దిశ’ యాప్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఏడాదిలోనే నాలుగు జాతీయ అవార్డులను సాధించడం విశేషం. ఇదిలా ఉండగా యాప్ డౌన్లోడ్, ఉపయోగించే విధానం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక ఇంటికి స్వయంగా వెళ్లి వివరించనున్నారని తెలిసింది. యాప్‌తో పూర్తిరక్షణ దిశ యాప్‌తో విద్యార్థినులు, యువతులు, మహిళలకు పూర్తి రక్షణ లభిస్తుంది. వారు ఆపదలో ఉన్నారని యాప్ ద్వారా సమాచారమిస్తే చాలు పోలీసులు తక్షణం అక్కడికి చేరుకుని వారిని రక్షిస్తారు. మహిళల రక్షణ కోసం ఇతరత్రా అనేక ఫీచర్లు ఈ యాప్‌లో పొందుపరిచారు. కాబట్టి ఈ యాప్‌ను యువతులు, మహిళలు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. – దీపికా పాటిల్, ప్రత్యేక అధికారి, దిశ విభాగం యాప్ వినియోగంపై అవగాహన సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం దిశ యాప్‌పై అవగాహన సదస్సులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎల్.ఎన్.పేట, కొత్తూరు, బొద్దాం, బడివానిపేట, చిలకపాలెం, జరజాం, కుప్పిలి, బెజ్జిపుట్టుగ, బూర్జపాడు, కేశుపురం, మండపల్లి పంచాయతీల్లో యాప్ ఆవశ్యకత గురించి పోలీసులు మహిళలకు వివరించారు. వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. ► తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, ఉప్పలగుప్తం, విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 22 పోలీసుస్టేషన్లలో అవగాహన సదస్సులు నిర్వహించారు. విజయవాడ కమిషనరేట్‌లో జరిగిన సదస్సులో డీసీపీలు విక్రాంత్‌పాటిల్, హర్షవర్ధన్‌రాజు, ఏసీపీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకూ సమాచారం, ఇతరత్రా సాయం ► యువతులు, మహిళలు తాము ఆపదలో ఉన్నామని భావించినప్పుడు పోలీసులతోపాటు తమ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చే వెసులుబాటు దిశ యాప్‌లో ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఐదు నంబర్లను ఆ యాప్‌లో ఫీడ్ చేసుకోవచ్చు. దాంతో ఆ ఐదు నంబర్లకు కూడా సమాచారం చేరుతుంది. వారు కూడా వెంటనే పోలీసులను సంప్రదించేందుకు అవకాశం ఉంటుంది. ► ప్రయాణ సమయాల్లో రక్షణ, మార్గ నిర్దేశం కోసం కూడా దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. అందుకోసం ఆ యాప్‌లో ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్‌ను ఏర్పాటు చేశారు. తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని అందులో నమోదు చేయాలి. వారు ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, వారి బంధుమిత్రులకు సమాచారాన్ని పంపుతుంది. దాంతో వారు అప్రమత్తమై రక్షణకు వస్తారు. ► దిశ యాప్‌లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లు కూడా ఉంటాయి. పోలీసు అధికారుల నంబర్లు, సమీపంలోని పోలీస్ స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఏర్పాటు చేశారు. ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, ట్రామా కేర్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, మందుల దుకాణాల వివరాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు 16 లక్షల డౌన్లోడ్లు ► దిశ యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 16 లక్షల మందికిపైగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. విపత్తుల్లో చిక్కుకున్న ఎందరో ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే వారిని రక్షించారు. నిందితులను అరెస్టు చేసి, న్యాయస్థానాల ద్వారా వారికి శిక్షలు విధించారు. ► దిశ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు తప్పనిసరిగా తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. 2 నిమిషాల్లో స్పందన గుంటూరు రూరల్: దిశ యాప్ పని తీరుపై విద్యార్థినులు, యువతులు, మహిళల్లో అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని హోం మంత్రి సమక్షంలోనే యాప్ పనితీరును పరిశీలించింది. గుంటూరు నగర శివారులోని నల్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన సభలో విద్యార్థిని దొడ్డా తేజస్విని సభా ప్రాంగణంలోనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఎస్ఓఎస్ బటన్ నొక్కింది. బటన్ నొక్కిన 30 సెకన్లలో కాల్ సెంటర్ నుంచి విద్యార్థినికి కాల్ వచ్చింది. తాను నల్లపాడు సెంటర్లో ఉన్నానని, ఆకతాయిలు వేధిస్తున్నారని విద్యార్థిని చెప్పింది. మరో 30 సెకన్లలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. నీవు ఉన్న ప్రదేశం గుర్తించామని, మరో నిమిషంలో అక్కడకు వస్తున్నామని చెప్పారు. అంతలో మరో అధికారి ఫోన్ చేసి.. భయపడవద్దని ధైర్యం చెప్పారు. అలా రెండు నిమిషాల్లో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు చెందిన దిశ మహిళా కానిస్టేబుల్ షేక్ ఫాతిమా దిశ, పెట్రోలింగ్ వాహనంతో విద్యార్థిని ఉన్న లొకేషన్‌కు చేరుకుంది. దిశ బృందం స్పందన చూసి, అక్కడ ఉన్న వారందరూ చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. ‘దిశ’ యాప్ ఉపయోగం ఎంతగా ఉంటుందో తెలిసినందున మహిళలందరూ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత విజ్ఞప్తి చేశారు. ‘ఈ యాప్ ఉపయోగం ఏమిటో ప్రత్యక్షంగా చూశాను. నా స్నేహితులందరితోనూ డౌన్లోడ్ చేయిస్తాను’ అని విద్యార్థిని దొడ్డా తేజస్విని పేర్కొంది. పుష్ బటన్ ఆప్షన్... ‘పుష్ బటన్’ ఆప్షన్ పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా పోలీసులు అందర్నీ ఒకేసారి అప్రమత్తం చేయవచ్చు. ఈ బటన్‌ను ఒకసారి నొక్కితే చాలు యాప్ ఉపయోగించే వారందరికీ ఒకేసారి పోలీసుల సందేశం చేరుతుంది. -
దిశ యాప్‌పై అవగాహనకు ప్రత్యేక డ్రైవ్
సాక్షి, అమరావతి/ఒంగోలు: రాష్ట్రంలో మహిళా భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యార్థినులు, యువతులు, మహిళలు అందరూ ‘దిశ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, వినియోగించుకునేలా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతం సవాంగ్ జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, సబ్ డివిజన్ అధికారులు, సీఐలు, ఎస్సైలు, దిశ పోలీస్ స్టేషన్ల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళా పోలీసులు, మహిళా పోలీసు అధికారులు దిశ యాప్‌పై మహిళలకు అవగాహన కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు, గ్రామ/వార్డు వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణ తర్వాత వీరంతా తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి వారి ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయడంతోపాటు అత్యవసర సమయాల్లో యాప్‌ను వినియోగించడంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. దీంతోపాటు పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి దిశ యాప్‌పై అవగాహన కల్పించాలని చెప్పారు. మహిళలపై వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగా దోషులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పందన, ఏపీ పోలీస్ సేవా యాప్, దిశ యాప్, సైబర్‌మిత్ర, వాట్సాప్‌ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు కేసులు నమోదు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను డీజీపీ పునరుద్ఘాటించారు. తమ పరిధి కానప్పటికీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు రవిశంకర్ అయ్యన్నార్, హరీష్‌కుమార్ గుప్తా, శంకర బత్ర బాగ్చి, ఐజీ నాగేంద్రకుమార్, దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశం ఎస్పీ ‘మ్యాపింగ్’ ఐడియా అమలు డీజీపీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో గల అనుమానాస్పద శివారు ప్రాంతాలను, గతంలో అవాంఛనీయ ఘటనలు జరిగిన ప్రదేశాలను, నేరాలు జరగడానికి ఆస్కారం ఉండే ప్రదేశాలను గుర్తించి, మ్యాపింగ్ చేయడం ద్వారా ఆయా ప్రదేశాల్లో ప్రత్యేక బీట్లు ఏర్పాటు చేసి, నిరంతరం నిఘా ఉంచాలన్నారు. తద్వారా నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. ఈ ‘మ్యాపింగ్’ ఐడియా పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డీజీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు యూనిట్లలోనూ దీనిని అమలు చేయాలని ఆదేశించారు. చదవండి: వైద్య విద్యార్థులకు మరో శుభవార్త.. ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు -
దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం మరింత పకడ్బందీగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం బుధవారం ఆమె తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలోని మహిళలకు ఈ యాప్‌పై అవగాహన వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసేలా చూడాలన్నారు. కాలేజీలు, స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థినులకు దిశ యాప్‌పై ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలను, సీసీ కెమెరాలను అవసరమైన చోట పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. -
మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు దిశ యాప్‌పై పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు. దిశ యాప్‌ను ఎలా వాడాలన్న దానిపై అవగాహన కలిగించాలని అధికారులకు స్పష్టం చేశారు. మహిళా భద్రత, దిశ యాప్ వినియోగంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎంవో అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి అక్క చెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసి అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వలంటీర్లకు తొలుత శిక్షణ ఇచ్చి, తర్వాత వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు దిశ యాప్‌పై అవగాహన కలిగించాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలనే విషయంపై అక్క చెల్లెమ్మలకు విడమరచి చెప్పాలన్నారు. దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకుని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కాలేజీలు, విద్యా సంస్థల్లోనూ విద్యార్థినులకు యాప్ వినియోగంపై అవగాహన కలిగించాలని, ఈ చర్యతో దిశ యాప్ వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు. అక్క చెల్లెమ్మలకు మరింత భద్రత కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలన్నారు. దిశ, స్థానిక పోలీస్స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధం చేయాలని, పోలీస్ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌వాహనాలను సమకూర్చాలని ఆదేశించారు. -
దిశ యాప్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం: హోంమంత్రి సుచరిత
సాక్షి, తాడేపల్లి: మహిళల భద్రత కోసం మరింత పకడ్బందీగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలోని మహిళలకు ఈ యాప్ పై అవగాహన వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిలో వలంటీర్లు, మహిళా పోలీసులను వినియోగించుకోవాలని సూచించారు. కాలేజీలు, స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థినులకు దిశా యాప్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. పెట్రోలింగ్ వాహనాలను, సీసీ కెమెరాలను అవసరమైన చోట పెంచాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. సీతానగరం ఘటనలో అనుమానితులను గుర్తించామని... త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. నిర్మానుష్యప్రాంతంలో జరగడంతో అనుమానితులను గుర్తించడం కష్టంగా మారింది. అయినా బాధితురాలి సహకారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. చదవండి: మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్ -
రెండు సెకన్లలోనే పోలీసులు స్పందించారు
బొమ్మలసత్రం (నంద్యాల): ‘ఆత్మస్థైర్యం కోల్పోయి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ చివరి క్షణంలో పిల్లలను బతికించుకోవాలన్న ఆశ కలిగింది. దీంతో దిశ యాప్ ద్వారా పోలీసులకు కాల్ చేశా. కేవలం రెండు సెకన్లలోనే వారు స్పందించారు. మా సమస్య విన్న కొద్దిసేపటికే ఘటన స్థలానికి చేరుకుని నాతోపాటు నా పిల్లలను రక్షించారు’ అని ఆదిలక్ష్మి అనే బాధితురాలు తెలిపింది. వివరాల్లోకెళ్తే.. కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవులకు చెందిన ఎ.ఆదిలక్ష్మి, తన కుమార్తెలు సుప్రియ (7), చరిత (5)తో కలిసి శుక్రవారం నంద్యాల–గిద్దలూరు ఘాట్ రోడ్డులో సర్వనరసింహస్వామి ఆలయం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దిశ యాప్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి వారిని కాపాడారు. శనివారం నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలితోపాటు ఆమె పిల్లలను జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పరామర్శించారు. డీఎస్పీ చిదానందరెడ్డి ఆధ్వర్యంలో బాధితురాలికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫక్కీరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలక్ష్మి భర్త ప్రసాద్ గతేడాది ప్రమాదవశాత్తూ కుందూ నదిలో పడి మృతి చెందాడన్నారు. ఆమె తన ముగ్గురు కుమార్తెలు సుప్రియ, చరిత, యామినిలతో కలిసి గ్రామంలోనే నివసిస్తోందని, భర్త లేకపోవడంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సూపర్ వాస్మోల్ ద్రావణాన్ని తాను సేవించి.. పెద్ద కుమార్తె సుప్రియ, రెండో కుమార్తె చరితకు కూడా తాగించిందన్నారు. కొంత సమయం తర్వాత కుమార్తెలను ఎలాగైనా బతికించుకోవాలన్న తపనతో తన సెల్‌ఫోన్‌లోని దిశ యాప్ ద్వారా తమకు కాల్ చేసిందన్నారు. దిశ యాప్ వల్లే బాధితురాలిని, ఆమె కుమార్తెలను రక్షించగలిగామని చెప్పారు. మహిళలకు ఏ సమస్య వచ్చినా యాప్ ద్వారా పోలీసులను సంప్రదించాలన్నారు. బాధితురాలిని కాపాడటంలో చొరవ చూపిన మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సిబ్బందిని ఆయన అభినందించారు. -
దిశ యాప్‌లో పుష్ బటన్ ఆప్షన్
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న దిశ మొబైల్ అప్లికేషన్ (యాప్)లో కొత్త ఆప్షన్ పొందుపరిచారు. తప్పుడు ప్రచారాలకు తెర దించుతూ..అత్యవసర సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సందేశాలను పంపేలా రాష్ట్ర పోలీస్ శాఖ ‘పుష్ బటన్ మెస్సేజ్ ఆప్షన్’ను యాప్‌లో చేర్చింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు జరుగుతున్న ‘దిశ’ కార్యక్రమాలు మంచి ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. దిశ యాప్ గత 13 నెలల్లో నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకోవడం గమనార్హం. దిశ కార్యక్రమాలను బలోపేతం చేసేలా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. దిశ పెట్రోలింగ్ వాహనాలు, సైబర్ కియోస్క్‌ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫుష్ బటన్ ఆప్షన్ ఇలా... రాష్ట్రంలో దిశ మొబైల్ యాప్‌ను 12.57 లక్షల మంది తమ డౌన్లోడ్ చేసుకున్నారు. వారందరికీ పోలీసులు ఏదైనా సమాచారాన్ని పంపించి అప్రమత్తం చేయాలనుకుంటే పుష్ బటన్ ఆప్షన్‌ను వినియోగిస్తారు. ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే చాలు అందరికీ ఏకకాలంలో పోలీస్ సందేశం చేరుతుంది. దీనిపై అజమాయిషీ పూర్తిగా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో ఉంటుంది. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు దిశ యాప్‌ను మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దామని, ఇందులో భాగంగా పుష్ బటన్ ఆప్షన్ తెచ్చామని పోలీస్ శాఖ టెక్నికల్ చీఫ్ పాలరాజు తెలిపారు. -
దిశ యాప్.. డౌన్లోడ్స్ 11 లక్షలు
సాక్షి, అమరావతి: మహిళల రక్షణే ధ్యేయంగా ఏపీ పోలీస్‌శాఖ తెచ్చిన దిశ మొబైల్ అప్లికేషన్ 11 లక్షల డౌన్లోడ్స్ను అధిగమించి రికార్డు సృష్టించింది. తెలంగాణలో దిశ ఘటనతో మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టాన్ని తెచ్చేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా ఆపదలో ఉన్న మహిళలు తక్షణం పోలీసుల సాయం పొందేలా ప్రత్యేకంగా దిశ మొబైల్ అప్లికేషన్ తెచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ఈ మొబైల్ అప్లికేషన్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వ ప్రయత్నం ఫలిస్తోంది. ఈ మొబైల్ అప్లికేషన్‌ను ప్లే స్టోర్‌లో అందుబాటలోకి తెచ్చిన పోలీస్ కృషిని యూజర్లు ప్రశంసిస్తున్నారు. దిశ యాప్ సాధించిన రికార్డులు ► 11లక్షలకుపైగా యాప్ డౌన్లోడ్స్ ► 79,648 మంది యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ ఉపయోగించుకున్నారు. తాము ప్రమాదంలో ఉన్నట్టు పోలీసులకు తక్షణ సంకేతాలిచ్చేలా ఈ బటన్ ఉపయోగపడుతోంది. అయితే ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు కొందరు, అనుకోకుండా కొందరు బటన్ ప్రెస్ చేశారు. ► దిశ యాప్ ద్వారా సహాయం కోరిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాష్ట్రంలో 604 మంది మహిళలకు అండగా నిలిచారు. ► దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను దర్యాప్తు చేసిన పోలీసులు 122 కేసులు నమోదు చేశారు. ► బాధిత మహిళలు ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చుననే వెసులుబాటుతో పోలీసులు 341 జీరో ఎఫ్ఐఆర్లను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ► ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం 67 అత్యాచార కేసులు, 195 లైంగిక వేధింపుల కేసుల్లో (మొత్తం 262 కేసులు) దిశ బిల్లులో ప్రతిపాదించినట్టు కేవలం ఏడురోజుల్లోనే పోలీసులు చార్జిషీటు వేయడం రికార్డు. 79 కేసుల్లో కోర్టు తీర్పులు దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన కీచకులకు వేగంగా శిక్షలు పడేలా చేయడంలో పోలీసులు పట్టుసాధిస్తున్నారు. 79 కేసుల్లో తీర్పులు వచ్చాయి. వీటిలో 66 కేసుల్లో జైలుశిక్ష, 12 కేసుల్లో జరిమానా విధించగా ఒక కేసులో జువైనల్ హోమ్‌కు తరలించారు. ప్రతి మహిళా ఉపయోగించుకోవాలి ప్రతి మహిళా తన మొబైల్లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. తనతోపాటు ఏ మహిళకు అన్యాయం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలి. ఈ యాప్‌ను దుర్వినియోగం చేయకూడదు. సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే 11 లక్షల డౌన్‌లోడ్స్‌తో ఈ యాప్ రికార్డు సృష్టించింది. యాప్ ద్వారా సమాచారం ఇస్తే చాలు.. సమీపంలోని పోలీసులు రంగంలోకి దిగి ప్రమాదం లో ఉన్న మహిళలకు సహాయం అందిస్తున్నారు. ఇబ్బందిపడే ప్రతి మహిళా ఈ యాప్‌ను ఉపయోగించుకునే స్థాయిలో చైతన్యం పెరగాలి. – పాలరాజు, ఏపీ పోలీస్ టెక్నికల్ చీఫ్ -
నేరస్తులపై కఠిన చర్యలు
సాక్షి, విశాఖపట్నం: వరలక్ష్మి కేసులో నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, దిశ చట్టం ప్రకారం ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గాజువాక మండలం చినగంట్యాడ సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని మంత్రి సుచరిత సోమవారం పరామర్శించారు. సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన ఆర్థిక సాయానికి సంబంధించిన రూ.10 లక్షల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులు పద్మప్రియ, సత్యగురునాథ్కు కలెక్టర్ వినయ్‌చంద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి ఆమె అందించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వరలక్ష్మి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. తక్షణమే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టం స్ఫూర్తితో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామన్నారు. నిందితుడు అఖిల్ సాయిని రిమాండ్‌కు తరలించారని.. అతని తండ్రి, వారి కుటుంబసభ్యులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. వరలక్ష్మి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చెక్కు అందజేస్తున్న హోంమంత్రి సుచరిత దిశ యాప్‌లో ఫిర్యాదు చేయండి.. చిత్తూరులో చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడికి 7 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారైందని.. విజయవాడలో 4 నెలల్లోనే నిందితుడికి ఉరిశిక్ష పడిందని హోం మంత్రి సుచరిత గుర్తు చేశారు. పాఠశాల స్థాయిలోనే మగపిల్లలకు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో అవగాహన కల్పించడంతో పాటు చట్టాలను కూడా వివరించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థినీ దిశ యాప్, ఏపీ పోలీస్ సేవా యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా, దిశ చట్టం ప్రత్యేకాధికారులు కృతికా శుక్లా, దీపికా ఎం.పాటిల్, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, సౌత్ ఏసీపీ రామాంజనేయరెడ్డి, ఆర్డీవో కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల సాయం
సాక్షి, అమరావతి: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకాన్ని తీవ్రంగా పరిగణించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల నుంచి వివరాలను తెలుసుకున్న సీఎం బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతురాలు వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, ఆ కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్‌ను ఆదేశించారు. ప్రతి టీనేజ్ బాలిక మొదలు మహిళలందరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకునేలా ఎడ్యుకేట్ చేయాలని సూచించారు. పాఠశాల, కాలేజీ విద్యార్థినులు వందశాతం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై జరిగే నేరాలను అదుపుచేయడానికి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఫలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని మహిళలు సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించకుండా సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. -
సత్ఫలితాలిస్తోన్న దిశ యాప్
-
మరో మహిళను కాపాడిన ‘దిశ యాప్’
సాక్షి, కైకలూరు: మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ ఎస్ఓఎస్ యాప్’ సత్ఫలితాలను ఇస్తోంది. కృష్ణా జిల్లాలో ‘దిశ యాప్’ ద్వారా ఎనిమిది నిమిషాల్లోనే పోలీసులు ఓ మహిళను కాపాడారు. ఇప్పటికే దిశ యాప్ ద్వారా కొందరు మహిళలు సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే.. తాజాగా మరో ఘటనలో మహిళకు మత్తుమందు ఇచ్చేందుకు ప్రయత్నం చేసిన ఆటోడ్రైవర్ బారి నుంచి ఆ మహిళ సేఫ్‌గా బయటపడింది. (దిశ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..) ఆటోలో ప్రయాణిస్తున్న కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామానికి చెందిన మహిళకు ఆటోడ్రైవర్ మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వబోయాడు. ప్రమాదాన్ని పసిగట్టిన సదరు మహిళ ‘దిశ యాప్’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే 8 నిమిషాల్లో చేరుకున్న పోలీసులు ఆ మహిళను కాపాడారు. పరారీ అయిన ఆటోడ్రైవర్‌ను రెండు గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా రక్షణ కోసం యాప్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ మహిళ కృతజ్ఞతలు తెలిపింది. వెంటనే స్పందించిన సిబ్బందిని ఎస్పీ రవీంద్రబాబు అభినందించారు. -
దిశ కంట్రోల్ రూమ్: తొలి బ్యాచ్ శిక్షణ పూర్తి
సాక్షి, విజయవాడ: దిశ కంట్రోల్ రూమ్‌లలో పనిచేసేందుకు ఎంపికైన తొలిబ్యాచ్‌కు దిశ స్పెషల్ ఐపీఎస్ అధికారిని దీపికా పాటిల్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, రాజమండ్రికి చెందిన 26 మంది యువతీ యువకులు మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందారు. దిశ అప్లికేషన్ ఏ విధంగా పనిచేస్తుంది, బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు ఎలా స్పందించాలి, సమాచారాన్ని దిశ ఎమర్జెన్సీ టీమ్‌లకు ఎలా చేరవేయాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. కీలక పాత్ర పోషించాలి : డీజీపీ శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పలు సూచనలు చేశారు. దిశ కంట్రోల్ రూమ్, దిశ ఎస్ఓఎస్ అప్లికేషన్ ప్రాముఖ్యతను, ఆపదలో ఉన్న మహిళల్ని ఎలా రక్షించాలో ఆయన వివరించారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశ పెట్టిన దిశ పోలీస్ స్టేషన్ విధులలో కీలక పాత్ర పోషించాలని ఆకాక్షించారు. ముఖ్యంగా మహిళల రక్షనే బాధ్యతగా భావించాలని, ఉద్యోగంలా కాకుండా సేవా గుణంతో బాధ్యతయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. -
గుడ్డిగా నమ్మితే చిక్కుల్లో పడతారు జాగ్రత్త!
మంగళగిరికి చెందిన ఓ మహిళ విజయవాడలో కన్సల్టెన్సీలో పనిచేస్తోంది. కన్సల్టెన్సీకి కోర్సుల వివరాలు తెలుసుకోడానికి వెళ్లిన చినకాకానికి చెందిన యువకుడు ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. సర్టిఫికెట్ల గురించి మాట్లాడాలని ఈ నెల 15న ఆ యువకుడు సదరు మహిళను విజయవాడలో కలిశాడు. అనంతరం మంగళగిరికి వెళ్తే అక్కడ ఫ్రీగా మాట్లాడుకోవచ్చని నమ్మబలికాడు. హాయ్‌ల్యాండ్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి మహిళను తీసుకెళ్లాడు. అక్కడికి యువకుని స్నేహితులు ఇద్దరు చేరుకున్నారు. ముగ్గురూ కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. సాక్షి, గుంటూరు: అఘాయిత్యాలకు పాల్పడేందుకు నిందితులు వల విసురుతున్న విషయాన్ని మహిళలు, గుర్తించకపోవడం వల్లే తరచుగా అనర్థాలు సంభవిస్తున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాబోవు ప్రమాదాన్ని పసిగట్టి వేగంగా తప్పించుకోడానికి ప్రయత్నించినా, లేక చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇచ్చినా అనర్థాలు సంభవించడానికి అవకాశం ఉండదని చెబుతున్నారు. ఆపదలో ఉన్న సమయంలో మహిళలు, యువతులు బేలగా మారితే నిందితులు మరింత బలవంతులుగా మారుతారని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. దిశ ఎస్‌ఓఎస్‌తో రక్ష ♦ ఆపదలో ఉన్న ఆడపడుచులకు తక్షణ సహాయం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ ఎస్ఓఎస్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ పనితీరు ఇలా... ♦ ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఫోన్లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ ఎస్ఓఎస్ యాప్ డౌన్లోడు చేసుకోవాలి. ♦ దిశ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడానికి మాత్రమే నెట్ అవసరం. తరువాత నెట్ లేకపోయినప్పటికీ యాప్ పనిచేస్తుంది. ♦ ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయం (ఎస్ఓఎస్) బటన్ నొక్కితే చాలు. మీ ఫోన్ నంబరు, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, మీ చిరునామా, దిశ కంట్రోల్ రూముకు చేరుతుంది ♦ ఆపదలో ఉన్న మహిళ, యువతి ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసే పరిస్థితిలో లేకపోతే ఆమె ఫోన్ గట్టిగా అటూ, ఇటూ ఊపితే చాలు. మీరు ఆపదలో ఉన్నారనే విషయం దిశ కంట్రోల్ రూమ్‌కు తెలిసిపోతుంది. ♦ ఒక వేళ బాధిత మహిళ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఆమె వాయిస్‌తో పాటు అక్కడ జరిగే దృశ్యానికి సంబంధించి పది సెకన్ల వీడియో రికార్డు అవడానికి వీలుంటుంది. ♦ ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే దిశ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి అక్కడి నుంచి సమీపంలోని పోలీసు స్టేషన్‌కు, పోలీసు రక్షక్ వాహనాలకు ఆటోమ్యాటిక్‌గా సమాచారం చేరిపోతుంది. ♦ ప్రమాదంలో ఉన్నవారి చెంతకు వెంటనే చేరుకోవడానికి జీపీఎస్ ఉన్న పోలీసు రక్షక్ వాహనంలోని మొబైల్ డేటా టెర్మినల్ సహాయపడుతుంది. ♦ ఆపదలో ఉన్నామనే విషయం దిశ కంట్రోల్ రూముతో పాటు మీ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులకు ఇలా మొత్తం ఐదు నంబర్లకు దిశ యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ♦ దిశ యాప్‌లోని ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ వినియోగిస్తే మీరు ప్రయాణిస్తున్న వాహనం మీ గమ్యస్థానానికి కాకుండా ఇంకెక్కడికైనా వెళుతుంటే కూడా సమాచారం దిశ కంట్రోల్ రూముతోపాటు మీరు నమోదు చేసుకున్న ఐదు నంబర్లకు పంపి అప్రమత్తం చేయవచ్చు. ♦ ఈ యాప్‌లోనే డయల్ 100, 112, సహా ఇతర ఎమర్జెన్సీ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా ఆపద సమయంలో సహాయం అర్థించవచ్చు. ♦ దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీసు స్టేషన్లు, ఆసుపత్రుల వివరాలు ఉంటాయి. మహిళలు, యువతులు జాగ్రత్త వహించాలి ♦ గుర్తు తెలియని వ్యక్తులు మాటా మాటా కలిపి సాన్నిహిత్యం పెంచుకుంటుంటే తొలుత అనుమానించాలి. ♦ వ్యక్తిగత వివరాలను వారికి చెప్పకుండా జాగ్రత్త వహించాలి. ♦ ఎవరూ లేని ప్రాంతంలో ముక్కూ మొహం తెలియని వారు సాయం చేస్తామని ముందుకు వస్తే నిరాకరించాలి. ♦ నిర్మానుష్య ప్రాంతాల్లో స్కూటీ, కారు ఇతర వాహనాలు ఆగిపోతే ఒంటరిగా ఉన్నప్పుడు వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ♦ ఎప్పుడూ బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రే, చాకు, కారం వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. ఆపద వచ్చినప్పుడు దాడికి ఉపయోగించుకోవాలి. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు నిందితుడిపై దాడి చేయడం ఆత్మరక్షణ కిందకే వస్తుంది. -
దిశ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..
సాక్షి, అమరావతి : మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న మహిళల కోసం రూపొందించిన ఈ యాప్‌ను కేవలం నాలుగు రోజుల్లోనే 50 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే ఓ అన్నగా తమ భద్రత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇటీవల ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ దిశ యాప్ ద్వారా సాయం కోరగా.. కేవలం ఆరు నిమిషాల్లోనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమెను వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఇంటర్నెట్ సాయంతో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.. ఆ తర్వాత ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా ఫోన్ ద్వారా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఎస్‌వోఎస్ బటన్ నొక్కడం ద్వారా గానీ, ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఉపడం ద్వారా గానీ ఆపదలో ఉన్న మహిళలు దిశ కాల్ సెంటర్‌కు సమాచారం ఇవ్వవచ్చు. ఆ తర్వాత ప్రమాదంలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులకు ఆటోమేటిక్‌గా సమాచారం అందుతుంది. దిశ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కంట్రోల్ రూమ్‌కు ఎలా ఫిర్యాదు చేయాలో పూర్తి వివరాలు ఓసారి చుద్దాం.. ► ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోనుల్లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా మొబైల్ ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ► ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయం(ఎస్‌వోఎస్) బటన్ నొక్కితే చాలు.. వారి ఫోన్ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. ► ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసే సమయం లేనప్పుడు చేతిలోని ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్ రూమ్‌కు సమాచారం చేరుతుంది. ► ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కితే వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్ రూమ్‌కు పంపించే వీలు ఉంది. ► ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి.. అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు, పోలీస్ రక్షక్ వాహనాలకు ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది. ► ప్రమాదంలో ఉన్నవారిని చేరుకోవడానికి జీపీఎస్ అమర్చిన పోలీస్ రక్షక్ వాహనాల్లోని ‘మొబైల్ డేటా టెర్మినల్’ సహాయపడుతుంది. ► అలాగే ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. ► దిశ యాప్‌లోని ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయొచ్చు. ► ఈ యాప్‌లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్ 100 అయితే నేరుగా కాల్ చేసి విషయం చెప్పాలి. డయల్ 112 అయితే మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. ► దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. -
4 రోజుల్లోనే 50 వేల మంది డౌన్లోడ్
సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్‌వోఎస్ యాప్ వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది. నాలుగు రోజుల్లోనే దిశ యాప్‌ను ఏకంగా 50 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారని దిశ స్పెషల్ ఆఫీసర్ దీపిక పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు స్పందిస్తున్న తీరుకు మెచ్చి గూగుల్ ప్లేస్టోర్‌లో 5కి ఏకంగా 4.9 స్టార్ రేటింగ్ ఇచ్చారన్నారు. 9వ తేదీ నుంచి సగటున రోజుకు రెండు వేల మందికిపైగా దిశ యాప్ ద్వారా పోలీస్ కమాండ్ రూమ్‌కు టెస్ట్ కాల్స్ చేస్తున్నారని వివరించారు. దిశ చట్టాన్ని తెచ్చిన 24 గంటల్లోనే మొదటి కేసులో పోలీసులు వాయు వేగంతో స్పందించిన విధానం, బాధితురాలికి పూర్తి స్థాయిలో భరోసా కల్పించిన తీరుతో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సమస్యల కారణంతో ఎక్కువ మంది దిశను ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారికి నిపుణులైన, అనుభవము ఉన్నవారి చేత కౌన్సెలింగ్ నిర్వహించి వారు కలసి మెలసి ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బుధవారం వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యమైనవి.. ► భార్య, భర్తల మధ్య నెలకొన్న వివాదంలో భర్త విచక్షణ కోల్పోయి కొడుతుండడంతో బాధిత మహిళ తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను షేక్ చేయడం ద్వారా దిశ కంట్రోల్ సెంటర్‌కు ఫిర్యాదు అందించింది. పోలీసులు నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకొని భర్త వేధింపుల నుంచి బాధితురాలిని రక్షించారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో వరుసకు సోదరుడైన వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ ఒక మహిళ ఎస్‌వోఎస్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ► తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి తరచుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఓ బాలిక దిశ ఎస్‌వోఎస్ ద్వారా ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు బాలిక వద్దకు చేరుకొని ధైర్యం చెప్పారు. వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. (చదవండి: ఇంటర్నెట్ అవసరం లేకుండానే..) -
దశ 'దిశ'లా స్పందన
సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది. ఈ నెల 9న ప్లేస్టోర్‌లో ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను 12 ఉదయం వరకు అంటే.. మూడు రోజుల్లోనే 35 వేల మంది డౌన్లోడ్ చేసుకోవడం విశేషం. అదేవిధంగా యాప్ సేవలను మెచ్చి గూగుల్ ప్లేస్టోర్‌లో 5కి ఏకంగా 4.8 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ యాప్ పనిచేస్తుందో.. లేదో తెలుసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున కాల్స్ వస్తుండటం మరో విశేషం. 9వ తేదీ నుంచి రోజూ రెండు వేల మందికిపైగా దిశ యాప్ ద్వారా పోలీస్ కమాండ్ రూమ్‌కు టెస్ట్ కాల్స్ చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ నెల 8న రాజమహేంద్రవరంలో దిశ పోలీస్‌స్టేషన్‌తోపాటు దిశ మొబైల్ అప్లికేషన్ (యాప్)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. దిశ.. పనితీరు ఇలా.. - ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోనుల్లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. - ఇన్స్టాల్ చేసుకోవడానికే ఇంటర్నెట్ అవసరం. తర్వాత ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా మొబైల్ ద్వారా యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. - ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయం (ఎస్‌వోఎస్) బటన్ నొక్కితే చాలు.. వారి ఫోన్ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. - ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసే సమయం లేనప్పుడు చేతిలోనిఫోన్ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్ రూమ్‌కు సమాచారం చేరుతుంది. - ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కితే వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్ రూమ్‌కు పంపించే వీలు ఉంది. - ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి.. అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు, పోలీస్ రక్షక్ వాహనాలకు ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది. - ప్రమాదంలో ఉన్నవారిని చేరుకోవడానికి జీపీఎస్ అమర్చిన పోలీస్ రక్షక్ వాహనాల్లోని ‘మొబైల్ డేటా టెర్మినల్’ సహాయపడుతుంది. - ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. - దిశ యాప్‌లోని ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయొచ్చు. - ఈ యాప్‌లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్ 100 అయితే నేరుగా కాల్ చేసి విషయం చెప్పాలి. డయల్ 112 అయితే మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. - దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. అవగాహన కల్పిస్తున్నాం మహిళల రక్షణ కోసం చేపట్టిన దిశ కార్యక్రమంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా ఎక్కువ మంది దీన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాం. దిశ యాప్‌నకు తక్కువ సమయంలోనే విశేష స్పందన లభిస్తోంది. యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన మహిళలకు ఆరు నుంచి పది నిమిషాల్లోనే తక్షణ సాయం అందిస్తున్నాం. – డీజీపీ గౌతమ్ సవాంగ్ -
24 గంటల్లోనే చార్జిషీట్ దాఖలు
ఏలూరు టౌన్/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా ‘దిశ’ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు శాసనసభలో తీర్మానం చేశారు. దిశ పోలీసు స్టేషన్లు, దిశ ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్ఓఎస్ యాప్ మహిళలకు రక్షణగా నిలుస్తోంది. ఈ యాప్ ద్వారా రక్షణ కోరిన ప్రభుత్వ మహిళా అధికారికి పోలీసులు అండగా నిలిచారు. ఆమెను వేధింపులకు గురిచేసిన ప్రొఫెసర్ బసవయ్య కేసులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ సర్కిల్ పోలీసులు చార్జిషీట్‌ను(అభియోగ పత్రం) కేవలం 24 గంటల్లోనే బుధవారం ఎక్సైజ్ కోర్టులో దాఖలు చేయడం గమనార్హం. అసలేం జరిగింది.. విశాఖపట్నం నుంచి విజయవాడకు బస్సులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళా అధికారిని ఆంధ్రా యూనివర్సిటీలో ఇనార్గానిక్, అనలిటికల్ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ కాలోతు బసవయ్య మంగళవారం తెల్లవారుజామున పోకిరీ చేష్టలతో వేధింపులకు గురిచేశాడు. వెంటనే ఆమె దిశ ఎస్ఓఎస్ యాప్ ద్వారా రక్షణ కోరగానే, బస్సు ఏలూరు జాతీయ రహదారిలో పెదపాడు మండలం పరిధిలోని కలపర్రు టోల్గేట్ వద్దకు చేరుకునేలోపు ఏలూరు త్రీటౌన్ పోలీసులు స్పందించి, కేవలం 6 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలికి రక్షణగా నిలిచారు. నిందితుడిని అరెస్టు చేసి ఏలూరు త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ఆదేశాలతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ కేసును పెదపాడు పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. పెదపాడు ఎస్సై జ్యోతిబసు కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం 24 గంటల్లోనే ఈ కేసులో చార్జిషీటును ఏలూరు ఎక్సైజ్ కోర్టులో దాఖలు చేశారు. దేహశుద్ధి జరిగినా బుద్ధి మార్చుకోని బసవయ్య దిశ యాప్ ద్వారా నమోదైన తొలి కేసులోని నిందితుడు కాలోతు బసవయ్య నాయక్ నేపథ్యం ఆరా తీస్తే అతడు గతంలోనూ మహిళలను వేధించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన బసవయ్య ఎమ్మెస్సీ చదివి, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరాడు. ఇటీవలే ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాడు. మహిళలను వేధింపులకు గురిచేయడం బసవయ్యకు అలవాటేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. భీమవరంలోని ఓ కాలేజీలో గతేడాది జరిగిన పరీక్షలకు బసవయ్య ఎగ్జామినర్‌గా వచ్చాడు. అప్పుడు అక్కడి విద్యార్థినులు, మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ కాలేజీ సిబ్బంది అతడిని నిర్బంధించి, దేహశుద్ధి చేశారు. అçప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు సమాచారం అందించారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని యూనివర్సిటీ ప్రతినిధులు భీమవరంలోని ప్రైవేట్ కాలేజీ సిబ్బందికి నచ్చజెప్పడంతో అతడిని విడిచిపెట్టారు. అయినప్పటికీ బుద్ధి మార్చుకోని బసవయ్య బస్సులో ప్రభుత్వ ఉద్యోగిని వేధిçస్తూ పోలీసులకు చిక్కాడు. పెదపాడు పోలీసులు అతడిపై క్రైమ్ నెంబర్ 52/2020 ఐపీసీ సెక్షన్ 354, 354(ఎ) కింద కేసు నమోదు చేశారు. బుధవారం ఏలూరు ఎక్సైజ్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు నిందితుడు బసవయ్యకు స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.