
సాక్షి, విజయవాడ: దిశ కంట్రోల్ రూమ్‌లలో పనిచేసేందుకు ఎంపికైన తొలిబ్యాచ్‌కు దిశ స్పెషల్ ఐపీఎస్ అధికారిని దీపికా పాటిల్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, రాజమండ్రికి చెందిన 26 మంది యువతీ యువకులు మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందారు. దిశ అప్లికేషన్ ఏ విధంగా పనిచేస్తుంది, బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు ఎలా స్పందించాలి, సమాచారాన్ని దిశ ఎమర్జెన్సీ టీమ్‌లకు ఎలా చేరవేయాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు.
కీలక పాత్ర పోషించాలి : డీజీపీ
శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పలు సూచనలు చేశారు. దిశ కంట్రోల్ రూమ్, దిశ ఎస్‌ఓఎస్ అప్లికేషన్ ప్రాముఖ్యతను, ఆపదలో ఉన్న మహిళల్ని ఎలా రక్షించాలో ఆయన వివరించారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశ పెట్టిన దిశ పోలీస్ స్టేషన్ విధులలో కీలక పాత్ర పోషించాలని ఆకాక్షించారు. ముఖ్యంగా మహిళల రక్షనే బాధ్యతగా భావించాలని, ఉద్యోగంలా కాకుండా సేవా గుణంతో బాధ్యతయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment