
సాక్షి, కృష్ణా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తానని అధికారం రాగానే మాట తప్పారని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కాన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ: విభజన తర్వాత ఏర్పాటైన కొత్త రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎదిగెందుకు నిధులు ఇవ్వడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం నీతి ఆయోగ్ పేరిట నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అన్యాయం చేయటం దారుణమన్నారు. రాజధానిలో పేదల పేరిట భూముల కొనుగోళ్ల వ్యవహారంపై ఈడీతో పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనా వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని తెలిపారు. వెనుకపడ్డ రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు ఇస్తున్నామంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డుకోవడం తగదన్నారు. కాగా రాష్ట్రంలో నేరాల రేటు 6 శాతం తగ్దిందని హోంమంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment