
సాక్షి, గుంటూరు: ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గ్రామ సచివాలయాల్లో సైతం వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అందరూ మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు.
కోవిడ్‌తో సహజీవనం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినప్పుడు అపహాస్యం చేశారని.. ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. మాస్క్ లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం లాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అపోహలను ప్రక్కన పెట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మంత్రి సుచరిత అన్నారు.
చదవండి:
ఏపీలో కొత్తగా 947 కరోనా కేసులు...
ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్‌గా కుంభా రవిబాబు బాధ్యతలు
Comments
Please login to add a commentAdd a comment